దిల్లీ లిక్కర్ కేసులో ఐదు నెలలుగా పైగా తిహాడ్ జైలులో ఉన్నా కవితపై కానీ, కేసీఆర్ కుటుంబం పై కానీ జనంలో సానుభూతి కనిపించడం లేదు. బయటకి రాగానే కవిత, బావురు మని ఏడ్చినా ఆ కన్నీళ్లు చూసిన తెలంగాణ జనం.. ఇసుమంతైనా అయ్యో అన్న వాళ్లు లేరు. దీనికి కారణం ఏంటి..


కవిత విషయంలో తెలంగాణ ప్రజానీకం ఎందుకు అంత కఠినంగా ఉన్నారు. ఇది కవిత విషయంలో మాత్రమేనా మొత్తం కేసీఆర్ కుటుంబాన్ని జనం ఇంకా అసహ్యించుకుంటూనే ఉన్నారా? తెలిసిన వాళ్లైనా.. తెలియని వాళ్లైనా ఎవరైనా బాధపడుతుంటే సహజంగా మనకు కూడా బాధపనిస్తుంది. అవతల వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే మనకి అంతో ఇంతో కళ్లు చమర్చుతాయి. కానీ కేసీఆర్ కుమార్తె కవిత విషయంలో మాత్రం తెలంగాణలో ఆ మూల నుంచి ఈ మూల వరకు ఏ ఒక్కరిలోను సానుభూతి కనిపంచడం లేదు.


కనీసం బీఆర్ఎస్ క్యాడర్ల్లో కూడా ఎక్కడా ఆ ఉత్సాహం తిరిగి తమ నాయకురాలు వచ్చిందని ఆనందం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ఇప్పటికైనా కేసీఆర్ కుటుంబం స్వీయ సమీక్ష చేసుకోవాలి.  జైల్లోంచి బయటకు రాగానే జై తెలంగాణ అని కవిత  బిగ్గరగా మూడు సార్లు అరిచారు. ఇక్కడ పదేపదే కేసీఆర్ కుటుంబం పప్పులో కాలేస్తున్నారు. వీళ్లు తప్పు చేసి జైలుకెళ్లారు.


పైగా జైలుకి వెళ్లింది అవినీతి ఆరోపణలతో.  సుప్రీం కోర్టు కూడా బెయిల్ మాత్రమే ఇచ్చింది. నిర్దోషి అని తేల్చలేదు. అందువల్ల తప్పులకు తలవంచుకొని వెళ్లకుండా తమ తప్పులను తెలంగాణ నినాదాన్ని ట్యాగ్ లైన్ గా వాడేస్తున్నారు అనే అపవాదు ప్రజల్లో ఉంది.  రాజకీయ దురుద్దేశంతోనే కేంద్రంలో ఉన్న బీజేపీ కవితను దిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు చేయించి ఉండవచ్చు. కానీ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏ మాత్రం లేదని అనలేం. తెలంగాణ జనం ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వడం లేదు. అందుకే ప్రజల్లో అంత కవితపై ప్రజల్లో సానుభూతి రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: