తెలంగాణలో ఇప్పుడు హైడ్రా హాట్ టాపిక్ గా మారుతోంది. హైదరాబాద్ లో చెరువుల్ని, చెరువు భూముల్ని ఆక్రమించి కట్టిన భవనాలను హైడ్రా వరుస పెట్టి కూల్చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది రాజకీయరంగు పులుముకోని రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారుతుంది. హైడ్రా ఎఫెక్ట్ ఎప్పుడు ఎవరిమీద ఎలా పడుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.


అలాంటి నిర్మాణాలు ఎక్కువగా బడా బాబులు, రాజకీయ నాయకులవే కాగా.... అక్కడక్కడ మోసపోయి కొనుక్కున్న వాళ్లు కొంతమంది సామాన్యులు కూడా ఉన్నారు. దీంతో చెరువు కట్టమీద నిర్మాణాలు ఉన్న వారికి కంటిమీద నిద్ర లేకుండా పోతుందట. ఇదిలా ఉండగా.... హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతున్న తరుణంలోనే జగన్ కు కొత్త టెన్షన్ మొదలైందని సమాచారం.


చెరువులు, కుంటలు ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాలను కూల్చేస్తోంది హైడ్రా. ఈ నేపథ్యంలో వైసీపీ చీఫ్ జగన్ ఇల్లు కూడా వచ్చింది. జూబ్లీహిల్స్ లోని లోటస్ పాండ్ లో జగన్ ఇల్లు చెరువును ఆనుకొని నిర్మించారు. ఇప్పటికే దీనిపై జగన్ కు హైడ్రా నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం దాన్ని కూడా కూల్చేస్తారా అని జోరుగా చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా...  హైడ్రా నోటీసులు జారీ చేసిన వారిలో పలువురు ఐఏఎస్ లు, ఐఆర్ఎస్ అధికారులకు చెందిన భవనాలు ఉన్నట్లుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారట.


చెరువులను పరిరక్షించేందుకే హైడ్రా పని చేస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చెరువులను ఎవరు ఆక్రమించినా....ఏ పార్టీ వారైనా సరే వదిలేదిలేదని తేల్చి చెప్పేశారు. అందరూ దీనికి సహకరించాలని కోరుతున్నారు. కేటీఆర్ కు చెందినదిగా ప్రచారంలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ లోనూ తాజాగా ఇరిగేషన్ అధికారులు కొలతలు చూశారు. ఆక్రమణలపైన నివేదికలు సిద్ధం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: