రాజ్యసభలో వైసిపి పరిస్థితి పూర్తి రివర్స్ కానుంది .. నిన్నటి వరకు జగన్ రాజ్యసభలో త‌న‌కు తిరుగే లేని బలం ఉందని భావించారు. అయితే ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన పలువురు రాజ్యసభ సభ్యులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. మోపిదేవి వెంకట రమణారావు - బీద మస్తాన్ రావు గురువారం రాజ్యసభ చైర్మన్ ను కలిసి తమ రాజీనామా పత్రాలు సమర్పించనున్నారు. ఇందుకోసం బుధవారమే వారిద్దరు ఢిల్లీకి చేరుకున్నారు. అదే దారిలో మరో ఆరుగురు ఎంపీలు కూడా తమ పదవుల తో పాటు వైసిపికి రాజీనామాలు చేసేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్న ఎనిమిది మందిలో నలుగురు తెలుగుదేశం పార్టీ వైపు ... మరో నలుగురు బిజెపి వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.


తొలినుంచి రాజకీయాల్లో ఉన్నవారు టిడిపి లోకి ... వ్యాపార వర్గాల నుంచి వచ్చిన వారు బిజెపి వైపు వెళ్లవచ్చునని తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ - బీద మస్తాన్ రావు తర్వాత మరో ఇద్దరు కూడా రాజీనామాలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తం ఇప్పుడు వైసీపీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులలో జగన్ బాబాయ్ అయిన వై వి సుబ్బారెడ్డి తో పాటు మొదటి నుంచి రాజకీయంగా జగన్ కు తోడు ఉండి ఇంతటితో రాజకీయాల నుంచి విరమించుకుందామని ఆలోచన అన్న మరో సభ్యుడు మొత్తం ముగ్గురు మాత్రమే మిగులుతారని మిగిలిన ఎనిమిది మంది కూడా తమ పదవులకు వైసీపీకి రాజీనామా చేసి జగన్ కు దండం పెట్టేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.


రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభలో మొత్తం 11 స్థానాలు ఉన్నాయి. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు విడతల్లో జరిగిన ఎన్నికలలో మొత్తం 11 స్థానాలను వైసీపీ సాధించింది. సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. రాజ్యసభలో 100% గెలిచాం ... లోక్సభ అసెంబ్లీలో తెదేపాను జీరో చేస్తాం అంటూ అప్పట్లో ముఖ్యమంత్రి జగన్ ప‌దే ప‌దే డబ్బాలు కొట్టుకున్నారు. తాజా ఎన్నికల్లో ఘోర పరాజ‌యం పాలవడంతో రాజ్యసభలోను ఇటు అసెంబ్లీ లోను లోక్సభలను జగన్ పార్టీ పరిస్థితి రివర్స్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: