- ( గుంటూరు - ఇండియా హెరాల్డ్ ) .

మోపిదేవి వెంకటరమణ గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత .. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి టైంలోనే ఆయన మంత్రిగా పనిచేశారు. ఒకప్పుడు రద్దు అయిన కూచినపూడి నియోజకవర్గం నుంచి ఆయన రాజకీయం చేసేవారు. ఆ నియోజకవర్గంలో రద్దు కావడంతో వైయస్ పట్టుబట్టి రేపల్లెలో అప్ప‌టి సిట్టింగ్ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావును కాదని మరి మోపిదేవికి సీటు ఇప్పించి గెలిపించుకున్నారు. ఆ తర్వాత మంత్రి పదవి కూడా ఇచ్చారు. అనంతరం మోపిదేవి జగన్ను నమ్మి వైసీపీలోకి వచ్చారు.


2014 ఎన్నికలలో ఓడిన మోపిదేవికి 2019లో జగన్ సీటు ఇచ్చారు. ఆ ఎన్నికలలో కూడా మోపిదేవి విజయం సాధించలేదు. ఆ తర్వాత ఆయన ను ఎమ్మెల్సీని చేసి మరీ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. జగన్ అక్రమస్తుల కేసులు ఆయనతో పాటు మోపిదేవి కూడా నిందితుడిగా ఉన్నారు. జగన్ తో పాటు జైలుకు వెళ్లారు.. జగన్ వెన్నంటే నిలిచారు. అయితే మోపిదేవి తాను రేపల్లె నియోజకవర్గం వదిలి బయటకు వెళ్ళన‌ని చెప్పారు . జగన్ మాత్రం మంత్రి పదవి పీకేసి ఆయనను బలవంతంగా రాజ్యసభకు పంపేశారు. రేపల్లెలో మోపిదేవి ప్రాధాన్యం తగ్గించే లా గత మూడేళ్లుగా వైసిపి వ్యూహాత్మకంగా చేప కింద నీరులా ఆయనకు ఎర్త్ పెట్టేసింది.


తాజాగా ఆయన రాజ్యసభకు రాజీనామా చేస్తున్నారన్న సమాచారం తెలియడంతో వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు మోపిదేవికి ఫోన్ చేసి 2019లో ఓడిన ఎమ్మెల్సీను చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తర్వాత రాజ్యసభ అవకాశం ఇచ్చారు అని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారట. అయితే మోపిదేవి మాత్రం నాకు వద్దని చెప్పిన రాజ్యసభకు బలవంతంగా పంపారు .. నన్ను నా ఈ నియోజకవర్గానికి దూరం చేశారు అనే గట్టిగానే సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేయండి అని కసురుకున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: