మోపిదేవి వెంకటరమణ వైసీపీ మాజీమంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు .. పైగా జగన్ అక్రమస్తుల కేసులో సహ నిందితుడిగా ఉండడంతో పాటు జగన్ తో కలిసి జైలు శిక్ష అనుభవించారు. అలాంటి మోపిదేవి వెంకటరమణ ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు ? పార్టీ మారుతున్నారు .. ఎందుకు జగన్ కు దూరం అవుతున్నారు .. అంటే వీరిద్దరి మధ్య ఓ విషయంలో గొడవ జరిగిందని ... అప్పటినుంచి మోపిదేవి జగన్ విషయంలో అంటి ముట్టినట్టుగా ఉంటున్నారని ఇక తాజాగా పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. 2014 - 2019 ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీ చేసిన మోపిదేవి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లోను తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తనకు రేపల్లె సీటు ఇవ్వాలని అడిగితే జగన్ ఒప్పుకోలేదు. కనీసం తన సోదరుడు కైనా టికెట్ ఇవ్వాలని పట్టుబట్టిన జగన్ అంగీకరించలేదు.


ఎన్నికలకు ముందు రేపల్లెలో ఈపూరు గణేష్ అభ్యర్థిత్వాన్ని మోపిదేవి వ్యతిరేకించారు. ఈపూరి గ‌ణేష్ ఎవ‌రో కాదు... టీడీపీ నుంచి గ‌తంలో మాజీ మంత్రి గా ప‌నిచేసిన ఈపూరి సీతారావ‌మ్మ కు కుమారుడు. ఈ రెండు కుటుంబాల మ‌ధ్య రాజ‌కీయ వైరం అప్ప‌ట్లో తీవ్రంగా ఉండేది. ఇక గ‌ణేష్ కు సీటు వ‌ద్దు.. త‌న కుటుంబానికే ఇవ్వాల‌ని మోపిదేవి పలుమార్లు జగన్ ను కలిసి వేడుకున్నారు. ఈ విషయం మాట్లాడటానికి మరోసారి తన వద్దకు రావద్దని జగన్ చెప్పడంతో మోపిదేవి ఇదే విషయాన్ని తన అనుచరుల వద్ద చెప్పి బాధపడ్డారట. ఇదంతా ఒక ఎత్తు అయితే జిల్లా వైసీపీ పగ్గాలు ఆయన చేతుల్లో పెట్టి సీట్లు ఖరారు విషయంలో కనీసం ఆయన అభిప్రాయాలు అస్సలు తీసుకోలేదట.


దీనికి తోడు తన సొంత నియోజకవర్గంలో తనకు ఇష్టం లేని వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇవ్వడంతో అప్పటి నుంచి మోపిదేవి మనస్థాపానికి గురయ్యారు. ఎన్నికల తర్వాత వైసిపిని టిడిపిలో చేరేందుకు సరైన టైమ్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే రాజ్యసభ పదవిని కూడా వదులుకునేందుకు ఆయన సిద్ధం కావడం విశేషం. ఇక మోపిదేవి పార్టీ మారడంతో రేపల్లె మున్సిపాలిటీ టిడిపి ఖాతాలో పడనుంది. మొత్తం 28 కౌన్సిలర్లకు వైసీపీ బలం 26గా ఉంది. మోపిదేవితో పాటు పలువురు నేతలు టిడిపి తీర్థం పుచ్చుకోనన్నారు. ఈ లెక్కన చూస్తే రేపల్లె మున్సిపాలిటీ ఇప్పుడు టిడిపి ఖాతాలో పడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: