వైసీపీ అధినేత జగన్ వచ్చే నెలలో తన కుమార్తె పుట్టిన రోజు పురస్కరించుకొని బ్రిటన్ పర్యటనకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ అనూహ్యంగా ఈ పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే ఉరుములు లేని పిడుగులు పడినట్టుగా పార్టీ పరిస్థితి మారిపోయింది. నిన్నగాక మొన్న తనతో పాటు కలిసి నెల్లూరు జిల్లాకు వచ్చి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ పోతుల‌ సునీత వంటి నమ్మకస్తురాలైన నాయకురాలు కూడా జగన్కు హ్యాండిచ్చారు. ఇక జగన్ కు అత్యంత నమ్మకస్తుడు ... జగన్ వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోతే ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయడంతో పాటు తర్వాత రాజ్యసభకు పంపిన మోపిదేవి వెంకటరమణ కూడా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.. ఆయన కూడా వైసీపీలోకి వెళ్లిపోతున్నారు.


టిడిపి నుంచి తీసుకువచ్చి రాజ్యసభ సభ్యుడిని చేసిన బీద‌ మస్తాన్ రావు కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఓవరాల్ గా వైసీపీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులలో ముగ్గురు మాత్రమే మిగులుతున్నారని ... మిగిలిన 8 మంది కూడా నలుగురు టిడిపిలోకి .. నలుగురు బీజేపీలోకి వెళ్లిపోతున్నట్టు ఒకటే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో జగన్ ఇప్పుడు బ్రిటన్ కి వెళితే పార్టీపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని జగన్ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి వచ్చే నెలలో 20 రోజులు పాటు ఆయన బ్రిటన్ లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు సిబిఐ కోర్టు నుంచి అనుమతి వచ్చింది.


కుమార్తెలతో కలిసి బ్రిటన్ లో ఎంజాయ్ చేయాలని అనుకున్నారు ... అయితే ఇప్పుడు అనూహ పరిణామాల నేపథ్యంలో జగన్ ఒకసారి ఆలోచనలో కూరుకు పోయారు. తాను లండ‌న్ వెళ్లి 20 రోజులు కూర్చుంటే ఇక్క‌డ పార్టీ చాలా వ‌ర‌కు ఖాళీ అవుతుంద‌న్న భ‌యంతో నే జ‌గ‌న్ త‌న లండ‌న్ టూర్ విర‌మించుకున్నార‌ని వైసీపీ టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: