ఆంధ్రప్రదేశ్లో ఈ యేడాది జరిగిన సాధారణ ఎన్నికలలో అధికారం కోల్పోయాక మాజీ ముఖ్యమంత్రి జగన్ కు వరుసగా ఊహించని ఎదురు దెబ్బలు ... గట్టి షాక్ లు తగులుతున్నాయి. జగన్ సన్నిహిత నేతలు కూడా జెండా ఎత్తేస్తున్నారు .. వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇలాంటి దారుణ పరాభవం తర్వాత జగన్ మనస్తత్వం బాగా తెలిసిన వారు అందరూ వైసీపీకి భవిష్యత్తు ఉంటుందని అనుకోవడం లేదు. అందుకే బయటకు చెప్పలేక వ్యక్తిగత కారణాలు అంటూ ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్యేలు .. మాజీ ఎమ్మెల్సీలు ... ఎమ్మెల్సీలు కీలక నేతలతో మొదలైన ఈ వలసల పర్వం తాజాగా రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీల రాజీనామాలతో కంటిన్యూ అవుతుంది.


ఈ వరుస పరిణామాలు ... వరుస ఎదుట దెబ్బలు అన్నీ వైసిపిని జగన్ తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
కొద్ది రోజుల్లో మరికొందరికి నేతలు కూడా వైసీపీని వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరకు పార్టీ మారాలి అనుకున్న నేతలను జగన్ ఆపే ప్రయత్నాలు కూడా చేయటం లేదట. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా జగన్కు సైతం పార్టీ భవిష్యత్తు ఏంటో కళ్ళ ముందు కనపడుతోందని ... అందుకే పార్టీని వీడుతున్న నేతలను బుజ్జగించేందుకు కూడా జగన్ ప్రయత్నాలు చేయడం లేదని అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.


ఇప్పటికే జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నా ఆ పార్టీ నేతలు ఎవరూ ఖండించడం లేదు. ఇలా చేస్తే అయినా బిజెపి దగ్గర తనకు ప్రాధాన్యం పెరుగుతుందని అనుకున్న చంద్రబాబు ఎన్డీయే కూటమి లో ఉండడంతో అది సాధ్యం కాదన్న నిర్ణయం నిర్ణయానికి జగన్ వచ్చేశారు. అందుకే జగన్ సైతం తన సన్నిహితులతో పార్టీలో ఉండే వాళ్ళు ఉంటారు ... పోయే వాళ్ళు పోతారు మనం ఏం చేయలేం అని చెబుతున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp