ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా రాజ్యసభ ఎంపీలు జగన్ కు షాకిస్తుండగా ఈ షాకుల వల్ల జగన్ పర్యటనలు సైతం రద్దవుతున్న పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రస్తుత పరిస్థితి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ మునిగిపోయే నావ అని ఆయన తేల్చి చెప్పారు.
 
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే రాష్ట్రంలో జగన్ మినహా వైసీపీలో ఎవరూ మిగిలే పరిస్థితులు కనిపించడం లేదని గంటా పేర్కొన్నారు. వైసీపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు జగన్ కారణమని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరతామంటే స్వాగతిస్తామని గంటా శ్రీనివాసరావు వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
 
తాము గేట్లు ఎత్తేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని గంటా వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతుండటం గమనార్హం. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు తమ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ మునిగిపోయే నావ అని గంటా పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి వచ్చిన వారిని స్వాగతిస్తామని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
 
జగన్ మోహన్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని, తీరును మార్చుకోవాలని గంటా సూచనలు చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. జగన్ తన తీరును మార్చుకుంటే మాత్రమే 2029 ఎన్నికల్లో అయినా వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందని గంటా పేర్కొన్నారు. జగన్ మానసిక పరిస్థితి బాలేదని షర్మిల గతంలోనే చెప్పారని గంటా శ్రీనివాసరావు వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. గంటా శ్రీనివాసరావు కామెంట్ల గురించి వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. వైసీపీ సోషల్ మీడియా ద్వారా టీడీపీ విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు వస్తోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: