తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హైడ్రా పేరు వింటే అక్రమార్కులు గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో సైతం ఎవరైనా చెరువులను, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టాలంటే భయపడేలా హైడ్రా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లను కూల్చివేయడం ద్వారా హైడ్రా వార్తల్లో నిలుస్తోంది. స్వయానా సీఎం రేవంత్ సోదరుడికి సైతం హైడ్రా నోటీసులు అందిన సంగతి తెలిసిందే.
 
అయితే కొంతమంది అధికారులు హైడ్రా పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. అలాంటి అధికారులకు షాకిచ్చేలా రేవంత్ రెడ్డి కామెంట్లు చేశారు. హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
 
గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డు పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అమాయకులను భయాందోళనకు గురి చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని మున్సిపల్, ఇరిగేషన్, రెవిన్యూ అధికారులపై సైతం ఫిర్యాదులు వచ్చాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అక్రమంగా డబ్బులు వసూలు చేసేవాళ్లపై కఠిన చర్యలు తప్పవని సీఎం అన్నారు.
 
ఎవరైతే వసూళ్లకు పాల్పడుతున్నారో ఆ అధికారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు సూచనలు చేయడం గమనార్హం. రేవంత్ వార్నింగ్ తో అధికారుల తీరు మారుతుందేమో చూడాల్సి ఉంది. ఇలాంటి అధికారుల విషయంలో ప్రభుత్వం ఎంత వేగంగా కఠిన చర్యలు తీసుకుంటే ప్రజల్లో ప్రభుత్వంపై అంతే వేగంగా నమ్మకం పెరుగుతుందనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే కఠిన నిర్ణయాలను తీసుకుంటూ తప్పు చేసిన వారందరికీ భారీ షాకులిచ్చే దిశగా అడుగులు వేస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సీఎం  రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: