2024 వైసీపీ ఓటమికి కారణాలలో వైఎస్ షర్మిల కూడా ఒకరు.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా షర్మిల కొనసాగుతూ ఉన్నది.. ముఖ్యంగా వైసీపీ పార్టీ ఓట్లలో కనీసం ఐదు పర్సెంటేజ్ ఓట్లు అయిన కాంగ్రెస్ పార్టీ చీల్చడంతో చాలా చోట్ల సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇక అప్పటినుంచి చాలా యాక్టివ్ గా ఉన్న వైఎస్ షర్మిల ఇటీవలే అటు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని కూటమి  నేతలను సైతం టార్గెట్ చేస్తూ విమర్శిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరొకసారి కూటమి ప్రభుత్వం పైన షర్మిల విమర్శిస్తోంది.వాటి గురించి చూద్దాం.


కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూటమి ప్రభుత్వం పైన  కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విషజ్వరాలతో ఒనికిస్తోంది కూటమి ప్రభుత్వం.. ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తోంది అంటూ ఆమె ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యం పనికిరాదంటూ కూడా హెచ్చరించింది. విషజ్వరాలతో ఆంధ్రప్రదేశ్ కాస్త జ్వరాంధ్రప్రదేశ్గా మార్చేస్తారేమో అంటూ  తెలియజేస్తోంది. అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మంచాలే లేవని ఒకే మంచం పైన ఇద్దరు ముగ్గురిని  పేషెంట్లను  ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటూ తెలియజేసింది. మరి ఇంతటి దుస్థిత అంటూ తెలుపుతోంది.


ప్రజలు మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ ఐదేళ్లపాటు గత సర్కారుని తిడుతూనే కాలయాపన చేస్తారా లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా లేదా అంటూ షర్మిల ప్రశ్నించింది.. డెంగ్యూ వ్యాధి పైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని.. ఇలాంటి విషయాల పైన డైరెక్ట్ గా సీఎంనే పర్యాయవేక్షించి తగు నిర్ణయాలు తీసుకోవాలంటు వైయస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ నుంచి ఒక పోస్టుని షేర్ చేసింది. షర్మిల ఈ విషయాలే కాకుండా ఎన్నో విషయాల పైన కూడా స్పందిస్తూ ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో షర్మిల క్రేజ్ ఏమైనా పెరిగి ఆమెకు అవకాశం కలుగుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: