ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జేత్వాని కేసు హాట్‌ టాపిక్‌ అయింది. జగన్‌ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జేత్వానిను కిడ్నాప్‌ చేసి.. వైసీపీ నేతలు, విజయవాడ పోలీసులు వేధించారట. 14 రోజుల పాటు బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జేత్వాని బంధించి చిత్ర హింసలు పెట్టినట్లు రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వ్యవహారం వెనుక వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఉన్నారని సమాచారం.


బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జేత్వానిని ప్రేమించి...మోసం చేశాడట వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్. 2015 నుంచే బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జేత్వానికు వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ దగ్గరయ్యాడట. ఈ విషయాన్ని స్వయంగా  బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జేత్వాని చెప్పడం జరిగింది. ఆ తర్వాత తనను బంధించినట్లు చెప్పింది  బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జేత్వాని.


ఇప్పుడు దొంగ కేసు పెట్టారని కూడా వెల్లడించింది. దీనిపై వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు విచారణ చేయించి.. తమకు న్యాయం చేయాలని  బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జేత్వాని కోరింది. ఇక  బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జేత్వాని విజ్ఞప్తి మేరకు వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్‌ స్పందించి.. కేసు విచారణ ప్రారంభించింది. ముంబై హీరోయిన్ జిత్వాని వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.

ఐపీఎస్సుల ప్రమేయం ఉండడంతో జిత్వానీ ఎపిసోడును సీరియస్సుగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. జిత్వానీతో ఆన్లైన్ లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశించింది బాబు ప్రభుత్వం. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సీఎంఓ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు..ముంబై సినీ నటి కాదంబరీ  జేత్వాని  వ్యవహారంపై విచారణ అధికారిని నియమించారు బెజవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. విజయవాడ క్రైమ్ ఏసీపీ స్రవంతి నీ విచారణ అధికారిగా నియామకం అయ్యారు. ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని వస్తున్న వార్తలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలనీ సీపీ ఆదేశాలు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: