అలాగే రాజధాని ప్రాంతం అమరావతిలో ల్యాండ్ పోలింగ్ కోసం రైతుల పొలాలు ఇచ్చారని తమ పొలాలు ఇవ్వడంతో వారు చాలా నష్టపోయారని.. రాజధాని పూర్తి అయ్యేవరకు కౌలు రైతు పథకం వారికి ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ కూడా నిర్ణయించుకుంది. కానీ గత వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పొలాలు ఇచ్చిన రైతులకు కౌలు రైతు చెల్లించలేదని ఈ విషయం పైన అసలు ఆలోచించలేదని తెలిపారు నారాయణ. ఇప్పుడు సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ వీరికి మరో ఐదేళ్ల పాటు కవులు రైతు డబ్బులు వస్తాయని తెలియజేశారు.
అమరావతి లో ఉండే రైతులకు ఉపాధి కోల్పోవడంతో పెన్షన్ కూడా ఇవ్వాలనే విధంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం .ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే క్యాబినెట్లో కౌలు రైతులకు సంబంధించిన విధివిధానాలపైన నిర్ణయం తీసుకుంటున్నారని రైతు సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఉన్నది అంటూ తెలియజేశారు. రాజధాని కోసం రైతులు చేసిన పోరాటాలు త్యాగాలు సైతం ఎవరు మర్చిపోకూడదునీ వారిని దృష్టిలోనికి పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలంటూ కెవినట్లు సీఎం చంద్రబాబు చెప్పారట. ఇందులో భాగంగా వచ్చే నెల 15వ తేదీన రైతుల ఖాతాలో డబ్బులను జమ చేయబోతున్నట్లు తెలియజేశారు. మరి ఎంత డబ్బులు అనే విషయం తెలుపలేదు.