కూటమిలోని మంత్రులను సైతం ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరిస్తూ ఉన్నారు.. క్యాబినెట్లో భేటీ అయిన తర్వాత పార్టీ సమావేశాలు, ఇలా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ప్రతిసారి కూడా చంద్రబాబు క్లాస్ పీకుతూనే ఉన్నారట. అయినప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మారడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టను సైతం భంగం కలిగించేలా అధికార దర్పంతో వెలిగిపోవాలని ఆలోచనతో చాలామంది తప్పటడుగులు వేస్తున్నారంటూ కూటమి నేతలను హెచ్చరిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ వీరిలో ఎలాంటి మార్పు రావడం లేదంటే తెలుపుతున్నారట.


చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్న కొంతమంది నేతలు లైట్గా తీసుకుంటున్నారని ప్రచారం వినిపిస్తోంది. ఇప్పుడు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో ఇరుక్కొని సైతం ప్రభుత్వ ప్రతిష్టకు సైతం ఇబ్బందులు తలెత్తేలా చేస్తూ ఉన్నారని చంద్రబాబు ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారట. అటు జనసేన నేతలలో కూడా ఇలాంటి పనులే చేస్తున్నారని పవన్ కళ్యాణ్ వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్న కొంతమంది ఎమ్మెల్యేల తీరు చాలా వివాదాస్పదంగా మారుతున్నది.


164 మంది బలం ఉందని ధీమాతో తప్పులు చేస్తే గత ప్రభుత్వం లో చేశారని మనము చేస్తే ఎలా అంటూ అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు హెచ్చరిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేల తీరు మారడం లేదు. ముఖ్యంగా పోలీసులతో గొడవలు పడుతున్న మంత్రుల భార్యలు.. మంత్రుల భార్యల పుట్టినరోజులకు పోలీసులను పిలవడం.. అలాగే ఇటీవల ఒక ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా దిగడం. మరొక ఎమ్మెల్యే భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఫిర్యాదులు రావడం ఇలా ఇవే కాకుండా చాలా అంశాలు కూడా కూటమి నేతలను ఇబ్బంది పెట్టేలా చేస్తున్నాయట. వీటి మీద యాక్షన్ తీసుకుంటున్నప్పటికీ కూడా చేసేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉందని తెలియజేస్తున్నారు. రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అంటే క్రమశిక్షణతో ఉండాలని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: