జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ నేతలు నన్ను అట బొమ్మలా వాడుకున్నారు అంటూ బాంబ్‌ పేల్చింది బాలీవుడ్ హీరోయిన్ కాదంబరీ జెత్వాని. గురువారం రాత్రి 10 గంటల సమయంలో... శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు బాలీవుడ్ హీరోయిన్ కాదంబరీ జెత్వాని. ఈ సందర్భంగా మీడియాతో బాలీవుడ్ హీరోయిన్ కాదంబరీ జెత్వాని...మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై ఆరోపణలు చేశారు. అప్పట్లో ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టి అనేక విధాలుగా వేధించారని ఫైర్ అయ్యారు.


నా పై అక్రమ కేసులు పెట్టి వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని బాంబ్‌ పేల్చారు. నా దగ్గర ఉన్న ఆధారాలన్నిటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తానని వెల్లడించారు. నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నానని తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కూడా వెల్లడించారు. డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.


నా పై 2014లో మల్టిపుల్  క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ పెద్దలు. పోలీస్ అధికారులు...నన్ను అట బొమ్మలా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేకంగా కొందరు గత ప్రభుత్వలో ఉన్న వ్యక్తులు నన్ను చిత్ర హింసలకు గురిచేశారన్నారు. అలాగే నా కుటుంబాన్ని చిత్ర హింసలకు గురి చేసారని తెలిపారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని... ఎవరికి ఇలా జరగకూడదని కోరారు. నాకు జరిగిన అన్యాయం పై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా ఏపి ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. నాకు న్యాయం జరుగుతుందని ఏపీ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు  బాలీవుడ్ హీరోయిన్ కాదంబరీ జెత్వాని. ఇక ఇవాళ విజయవాడకు వెళ్లనున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: