* పీజేఆర్ అనుచరుడిగా దానంకు గుర్తింపు
* ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర
* ఖైరతాబాద్ లో కబ్జాలు చేసినట్లు ఆరోపణలు
*తెలంగాణ ఉద్యమాన్ని తొక్కిసిన దానం
తెలంగాణ రాష్ట్రంలో జంపింగ్ జపాంగ్ నేతలు ఎక్కువైపోయారు. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో... ఆ పార్టీలో ఉన్న... శాసనసభ్యులు పార్టీ మారుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ టికెట్ పైన గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు... కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు చెబుతున్న చాలామంది నేతల్లో... దానం నాగేందర్ ఒకరు. టిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి... మొదట్లోనే వచ్చేసారు దానం నాగేందర్.
వాస్తవానికి టిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే దానం నాగేందర్ ఎమ్మెల్యే నే కాకపోవు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓటు వేశారు ఓటర్లు. కానీ దానం నాగేందర్ వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయేవాడు. అంటే హైదరాబాద్ నగరం మొత్తం టిఆర్ఎస్ హవాస్పష్టంగా కనిపించింది. ఆ గాలిలో దానం నాగేందర్ కూడా విజయం సాధించారు.
వాస్తవానికి ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్... ఉద్యమ నేత దాసోజు శ్రవణ్ కు దక్కేది. కానీ కెసిఆర్... నాగేందర్ ను నమ్మి టికెట్ ఇచ్చారు. కానీ గెలిపించిన టిఆర్ఎస్ పార్టీకే వెన్నుపోటు పొడిచి జంప్ అయ్యారు దానం నాగేందర్. గతంలో తెలంగాణ ఉద్యమకారులను.. అణిచివేసిన దానం నాగేందర్... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పిజేఆర్ డ్రైవర్ గా పనిచేసి... రాజకీయాల్లోకి వచ్చారు.
1994 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్న దానం నాగేందర్... ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. వైయస్సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు దానం నాగేందర్. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ లో కీలక నేతగా ఎదిగిన దానం నాగేందర్... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత... టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే మొన్న 2023 లో టిఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్లారు.