ఒట్టు తమ పార్టీ మారే ప్రసక్తే లేదు. ఓడిన గెలిచిన బిఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం. కామెంట్స్ చేసిన నేతలు సైతం చివరికి పార్టీని వీడారు అని చెప్పాలి. అలాంటి వారిలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఒకరు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం మొత్తం అటు కాంగ్రెస్ హవా నడిపిస్తే. ఒక్క భద్రాచలంలో మాత్రం బిఆర్ఎస్ తరఫున తెల్లం వెంకట్రావ్ విజయం సాధించారు. ఇది కాస్త బిఆర్ఎస్ పార్టీకి ఉపశమనం కలిగించింది. అయితే ఇక బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగిపోయిన నేపథ్యంలో తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్లో చేరబోతున్నట్లు వార్తలు వస్తే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. బిఆర్ఎస్ తోనే ఉంటాను అంటూ తెళ్ళం వెంకటరావు చెప్పారు.
కానీ లోక్సభ ఎన్నికల తర్వాత అటు గులాబీ పార్టీకి గుండు సున్న వస్తుందని ముందే గ్రహించిన తెల్లం వెంకట్రావు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు చివరికి గులాబీ పార్టీని వీడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక ఈయన కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ఇక కాంగ్రెస్ వశం అయిపోయింది అని చెప్పాలి. ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి కారు పార్టీ కార్యకర్తలకు దూరంగానే ఉంటున్నారు తెల్ల వెంకటరావు.. చివరికి కాంగ్రెస్ లో చేరి కెసిఆర్ కు షాక్ ఇచ్చారు.