- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) .
విడదల రజిని చంద్రబాబు సైబరాబాద్ లో నాటిన చెట్టు మొక్కను అని పదేపదే చెప్పుకున్న ఆమె 2019 ఎన్నికలకు ముందు బాబుకు షాక్ ఇచ్చి వైసీపీలోకి వెళ్లి చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే సీటు తెచ్చుకోవడం ... ఎమ్మెల్యేగా గెలవడం ఆ వెంటనే మంత్రి అయిపోవడం చకచకా జరిగిపోయాయి. వైసీపీలోకి వెళ్లిన రజిని చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. మొన్న ఎన్నికలలో జగన్ రజనీ పై చిలకలూరిపేటలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆమె సీటు మార్చారు. రజనీ ని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చిన అక్కడ ఆమె పిడుగురాళ్ల మాధవి చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు.
వాస్తవానికి ఈ ఎన్నికల ప్రచారంలో రజనీ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి ... ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జనసేనలోకి వచ్చేస్తాను అని చెప్పుకున్నా జనాలు మాత్రం ఆమెను 53, 000 ఓట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తన భర్త కాపు సామాజిక వర్గం కావడంతో ... ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని రజని జనసేనలోకి వెళ్లే ప్రయత్నాలు చేశారన్న ప్రచారం గట్టిగా నడిచింది. అయితే గుంటూరు జిల్లా జనసేన నేతలతో పాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన నేతలు ఎవరు రజని జనసేనలోకి రావడానికి ఇష్టపడలేదు.
ఆ తర్వాత ఆమె బిజెపి కి వెళ్లేందుకు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని మరో ప్రచారం జరుగుతుంది ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉందని అంటున్నారు.. తను పార్టీ మారుతున్నట్టు బెదిరించి వైసీపీలో మరింత కీలక పదవి కొట్టేయాలన్న ఆలోచనలో కూడా రజిని ఉన్నారని ... అందుకే ఇలా లీకులు ఇస్తున్నారని అంటున్నారు .. మరి ఇందులో వాస్తవ అవాస్తవాలు ఏంటో రజనీకే తెలియాలి.