దాంతో వారందరూ బిజెపిలో సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో అంట కాకి ఆర్థిక ప్రయోజనాలు పొందినవారు ... టిడిపి అంటే ద్వేషం చూపించే వారిని పక్కన పెట్టి పదవుల ప్రతిపాదనలు తీసుకురావాలన్న అభిప్రాయం కూటమిలో వినిపిస్తోంది. వైసీపీతో అంటకాగిన నేతలు ఎవరికీ ఒక్క ఎమ్మెల్యే టికెట్ ... ఎంపీ టికెట్ కూడా రాకుండా చేయడంలో చంద్రబాబు బాగా సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు సీట్లు త్యాగం చేసిన బిజెపి నేతలు నామినేటెడ్ పదవులు కోరుతున్నారు .. ఇప్పుడు పదవులు ఇచ్చాక వారు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తే ఇబ్బంది పడతాం అన్న భావన చంద్రబాబులో ఉంది.
మరోవైపు జనసేన పార్టీ నుంచి కూడా పదవులు ఒత్తిడి ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. ఈ ఎన్నికలలో చాలామంది ఎమ్మెల్యే సీట్లు ఆశించిన జనసేన నేతలు సీట్లు త్యాగం చేశారు. ఈసారి తమకు కచ్చితంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని .. పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి చేస్తున్నారు. కొందరు పదవులు ఇవ్వకపోతే తమ అసంతృప్తి బహటంగానే వ్యక్తం చేసేందుకు కూడా వెనకాడని పరిస్థితి. ఏది ఏమైనా నామినేటెడ్ పదవులు పంపిణీ విషయంలో చంద్రబాబుకు పెద్ద తలనొప్పులు తప్పేలా లేదు. మరి ఈ పంచాయితీని ఆయన ఎలా పరిష్కరిస్తారో చూడాలి.