- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) .

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతిపక్ష వైసిపి నుంచి ఇతర పార్టీలలోకి జంప్ చేసే నేతల సంఖ్య ఎక్కువ అవుతుంది. వాస్తవంగా చూస్తే వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో ఆ పార్టీ అధినేత జగన్ పై నమ్మకం లేని వైసిపి నేతలు ... మాజీ ఎమ్మెల్యేలు ... మాజీ మంత్రులు చివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు సైతం గోడ దూకేస్తున్నారు. తాజాగా నిన్న‌టికి నిన్న‌ వైసీపీ ఎంపీ ... మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ తో పాటు మరో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు తమ ఎంపీ పదవులతో పాటు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామాలు చేశారు. వీరిద్దరూ త్వరలోనే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోను న్నారు.

వీరితోపాటు కొందరు ఎమ్మెల్యేలు మరికొందరు రాజ్యసభ సభ్యులు కూడా త్వరలోనే సైకిల్ ఎక్కేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే స్థానిక సంస్థల వైసిపి ప్రజా ప్రతినిధులు కూడా తెలుగుదేశం పార్టీలోకి వరుస పెట్టి వచ్చేస్తున్నారు. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. టిడిపి ఆవిర్భావం నుంచి టిడిపిలో ఉంటూ పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన నాయకులకు దక్కని గౌరవం వైసీపీ నుంచి టిడిపిలో వచ్చిన నాయకులకు దక్కుతుందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ఐదేళ్లలో చాలామంది వైసిపి పాలనలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు ... ఆర్థికంగా నష్టపోయారు .. కేసులు పెట్టించుకున్నారు వీరంతా ఏ వైసీపీ నాయకుల మీద పోరాటాలు చేశారో ... ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు వీరిని టిడిపిలో చేర్చుకోవడం స్థానిక టిడిపి కేడ‌ర్ కు ఎంత మాత్రం రుచించడం లేదు. ప్రస్తుతం టిడిపిలో ఉన్న నాయకులు కన్నా ఒకసారి వైసీపీలోకి వెళ్లి తిరిగి టిడిపిలోకి వస్తేనే సరైన గౌరవం దక్కేలా ఉందన్న సెటైర్లు ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల్లోనే గట్టిగా పేలుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: