2019 లో 303 పార్లమెంటు స్థానాలను సింగల్ గా పోటీ చేసి బిజెపి పార్టీ గెలిచి.. 350కు పైగా స్థానాలు ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చినది భారతీయ జనతా పార్టీ.. ఈసారి మాత్రం భారీ విజయాన్ని అందుకోవాలని ప్రయత్నాలు చేసిన..ఈసారి సొంతంగా 240 స్థానాలు పరిమితమయ్యింది. తెలుగుదేశం పార్టీ ,JDU లతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది..కాని బలమైన శక్తులుగా ఈ రెండు పార్టీలు ఉన్నాయి. వీరిద్దరి మద్దతు చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు. ఈ దశలో జేడీయుకి సంబంధించి ఒకపక్క ఇబ్బంది పెట్టేటువంటి వ్యవహారాలు ప్రారంభమయ్యాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఓబిసి కులాల సంక్షేమం మిద ఏర్పాటైనటువంటి పార్లమెంటు కమిటీలలో కుల గణనకు సంబంధించి చర్చ గురించి విపక్షాలు పట్టుబడితే.. ఈ అంశం మీద చర్చ జరగాల్సిందే అంటూ .. బిజెపి మిత్రపక్షమైన జేడీయు కూడా ఈ విషయాన్ని డిమాండ్ చేసిందట. ప్రతిపక్షాలతో గొంతు కలిపింది జేడీయు. నిన్నటి రోజున కమిటీ భేటీలో టి ఆర్ బాలు డీఎంకే అంశాన్ని లేవనెత్తే విపక్ష సభ్యులుగా మద్దతు పలికారు.. ఇక వీళ్ళతో నితీష్ పార్టీ కూడా గొంతు కలిపినట్టుగా తెలుస్తోంది.


కులం పై తొలత చర్చించాల్సిన అంశాలను జాబితాలో చేర్చాలని మాణిక్యం ఠాకూర్ ,కళ్యాణ్ బెనర్జీ, గిర్ధర్ యాదవ్ కాంగ్రెస్ , తృణమూల్ జేడీలు మద్దతు ఇచ్చారట. కుల గణన కోసం కేంద్ర హోం శాఖ మంత్రి కమిటీ సిఫార్సులకు లేఖ రాయాలని బెనర్జీ సైతం పట్టు పట్టారట. కాంట్రాక్ట్, తాత్కాలిక పరిమితకాల నియామకాలలో రిజర్వేషన్లను వర్తింప చేస్తే బాగుంటుందని బిజెపి సభ్యుడు ఇక్కడ వ్యాఖ్యానించడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే 2029 ఎన్నికలలో బిజెపి పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక అప్పటి పరిస్థితులలో టిడిపి జెడియు పార్టీలు కూడా ఎలాంటి పరిస్థితిలో ఉంటాయో చెప్పడం కష్టము. కాంగ్రెస్ పార్టీ కూడా మళ్లీ భారీగా పుంజుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: