ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఈ మధ్యకాలంలో వైసిపి నేతలు వరుసగా వివాదాలలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల వలలో పడి వైసిపి నేతల బాగోతం బయటకు వస్తోంది. వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి,  అధికారి మధ్య సంబంధం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం, మొన్నటికి మొన్న దువ్వాడ శ్రీనివాస్  లవ్ స్టోరీ వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి... తలనొప్పిగా మారాయి.

 
అయితే ఇలాంటి నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్... వ్యవహారం తాజాగా బయటపడింది. ఓ అందమైన యువతి తో జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్.... ఎంతో సాన్నిహిత్యంగా దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోల గురించి తెలియక కొంత మంది... ఆ అమ్మాయితో జోగి రమేష్ కొడుకు  జోగి రాజీవ్... అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

 
కానీ వాస్తవం అది కాదని సమాచారం అందుతోంది. జోగి రమేష్ కుమారుడు... జోగి రాజీవ్....పెళ్లి చేసుకునే అమ్మాయితో.... సాన్నిహిత్యంగా దిగినట్లు కొంత మంది చెబుతున్నారు. ఏపీకి చెందిన శ్రేష్ట కర్మోజి  అనే యువతిని త్వరలోనే జోగి రమేష్ కొడుకు  జోగి రాజీవ్... పెళ్లి చేసుకోబోతున్నాడట. ఆమె ఏపీకి సంబంధించిన ప్రముఖ క్రిస్టియన్ మతబోధకుడు శామ్యూల్ కర్మోజి... కూతురు శ్రేష్టను  జోగి రాజీవ్ పెళ్లాడబోతున్నాడని సమాచారం.

 
ఈ శామ్యూల్ కుటుంబం విశాఖలో ఉంటున్నారట. శామ్యూల్ కూతురు శ్రేష్ట... జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్...  ఎంగే జ్మెంట్ కార్యక్రమం ఎన్నికల కంటే ముందు చాలా సింపుల్గా చేశారట. త్వరలోనే పెళ్లి అన్న సమయంలో... అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో  రమేష్ కొడు కు జోగి రాజీవ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే వీరిద్దరి వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు సిద్ధమైనట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: