వైసిపి రాజ్యసభ సభ్యుడిగా  పేరుపొందిన విజయసాయి రెడ్డి గవర్నర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో అందుకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఢిల్లీ పెద్దలను కూడా కలిసి తనను గవర్నర్గా పంపించాలని కోరుతున్నారనే విధంగా విజయసాయి రెడ్డి పైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒంటరిగా వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కలవడం జరిగిందట. దీని వెనుక ఉద్దేశం కూడా ఇదే అన్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. వీటితో పాటుగా బిజెపి పెద్దలను కూడా కలిసి తన మనసులో మాట చెప్పినట్లుగా ప్రచారం జరుగుతున్నది.



విజయసాయి రెడ్డికి ఇంకా రాజ్యసభ పదవీకాలం ఉండగానే గవర్నర్ పదవీకాలం ఉన్నప్పటికీ  వైసిపి నేతలలో చాలా అనుమానాలు సైతం మొదలవుతున్నాయట. విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మంచి సన్నిహితుడని కూడా చెప్పవచ్చు. అందుకే ఆయనకు రెండుసార్లు రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు. 2024 ఎన్నికలలో విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంటుకు నిలబడినప్పటికీ ఓడిపోయారు. ఒకానొక దశలో వైసీపీ పార్టీ నెంబర్ -2 గా పేరు పొందారు విజయసాయిరెడ్డి. మొదట వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా ఈయనకే అప్పగించారు.


ఆ తర్వాత ఇతరత్రా బాధ్యతలను కూడా అప్పగించారు ఇంత ప్రియారిటి  ఇచ్చిన విజయసాయిరెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత జగన్కు దూరమయ్యారని సమాచారం. జగన్ను కూడా ఈయన కలవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అన్ని ఆర్థిక లావాదేవీలను అన్నీ కూడా విజయ్ సాయి రెడ్డిని చూసుకునేవారు.. ఇటీవలే 2024 ఎన్నికలలో ఓడిపోవడంతో కాస్త నిరాశతో ఉన్నట్లుగా సమాచారం. విజయ్ సాయి రెడ్డికి ఢిల్లీలో అన్ని పార్టీలతో కూడా మంచి స్నేహబంధాలు ఉన్నాయి. అలాగే అమిత్ షాతో భేటీ అవ్వడం వెనుక కారణాలు ఏంటనే విషయం మాత్రం తెలుపలేదు.అలాగే మరొకవైపు వక్స్ బోర్డు స్థాయి సంఘంలో కూడా మెంబర్గా ఉండాలని అమిత్ షా విజయసాయి రెడ్డికి ఆఫర్ చేసినట్లుగా సమాచారం. మరి అసలు విషయాన్ని విజయ్ సాయి రెడ్డి తెలుపుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: