ఆ తర్వాత మోపిదేవిని రాజ్యసభకు కూడా పంపారు. అలాంటి నేత ఇప్పుడు జగన్ దగ్గర ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. తాను టీడీపీలో చేరుతున్నట్టు ఓపెన్ గానే ప్రకటించేశారు. ఇక మరో రాజ్యసభ సభ్యుడు గతంలో టిడిపిలో ఉన్న బీద మస్తాన్ రావు సైతం.. వైసీపీకి రాజీనామా చేసేశారు. ఆయన అడుగులు కూడా టిడి వైపే పడనున్నాయి. నిన్న వైసీపీకి తగిలిన ఈ ఎదురు దెబ్బల నుంచి ఆ పార్టీ నేతలు కోలుకోకముందే.. ఈరోజు మరో రెండు ఎదురుదెబ్బలు తగలబోతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేయిగా.. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి రాజీనామా చేయనున్నారు.
కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్సీలు కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా తమ పదవులకు రాజీనామా చేసి మండలి చైర్మన్‌కు లేఖలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోతుల సునీత కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. వరుసపెట్టి ఎమ్మెల్సీలు.. ఒక్కొక్కరు పార్టీని విడుతూ ఉండడంతో.. మండలిలో వైసీపీ బలం రోజురోజుకు తగ్గిపోతోంది. అయితే వైసిపి నుంచి రాజీనామా చేసిన అందరు నేతలు, అందరూ ఎమ్మెల్సీలు టిడిపిలో చేర్చుకునే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. కొందరిని పార్టీలో చేర్చుకునే విషయంలో టిడిపి నేతలు ఒప్పుకోవటం లేదని.. వీరంతా చంద్రబాబు దగ్గరే తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.