ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్న.. ఎన్నో ఇబ్బందులు పడ్డ.. ఎన్నో అవమానాలు, కేసులు, కోర్టులు, జైలు, శిక్షలు, ఆర్థికంగా నష్టపోవటాలు ఇలా ఎన్ని ఇబ్బందులు పడ్డ తెలుగుదేశం పార్టీ మీద.. అభిమానం కోసం చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్న సంకల్పంతో అవన్నీ తట్టుకొని.. ఎట్టకేలకు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. చివరకు ఎన్నికల వేళ జనసేన, బిజెపితో పొత్తు నేపథ్యంలో కొన్ని త్యాగాలకు సైతం సిద్ధపడాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు.. క్యాడర్‌కు చంద్రబాబు సంకేతాలు పంపారు. అయినా కూడా అవన్నీ తట్టుకునే పార్టీని నిలబెట్టారు.
 

వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. నిజం చెప్పాలంటే ఈ ఎన్నికలలో గెలుపు వెనక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి ఎంతో ఉంది. అలాంటి కార్యకర్తలు పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకుండానే చంద్రబాబు చేస్తున్న పనులకు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాము ఐదు సంవత్సరాలు.. ఏ వైసీపీ నాయకుల మీద అయితే పోరాటాలు చేసి పార్టీని కాపాడుకున్నామో.. ఇప్పుడు అదే వైసిపి వాళ్లను చంద్రబాబు టిడిపిలో చేర్చుకుంటున్న పరిస్థితి. వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు ద్వితీయ శ్రేణి నాయకులు.. టిడిపిలోకి వచ్చేస్తున్నారు.


విచిత్రం ఏంటంటే..? త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. తిరిగి టిడిపిలోకి వస్తున్న వారందరికీ మళ్ళీ టిక్కెట్లు ఇస్తారు.. వారే గెలిచి మళ్ళీ గద్దెనెక్కి పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న నాయకులను అణ‌గదొక్కే పరిస్థితి. ఉదాహరణకు తెలుగుదేశం 2014లో అధికారంలో ఉన్నప్పుడు ఏలూరు నగర మేయర్గా నూర్జహాన్ - పెదబాబు దంపతులకు అవకాశం ఇచ్చారు 2019 ఎన్నికలవేళ వాళ్ళిద్దరూ వైసీపీలోకి వెళ్లి అక్కడ తెలుగుదేశం పార్టీ ఓటమికి కృషి చేశారు అనంతరం వైసిపి లోను వాళ్ళు మేయర్లుగా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి రావడంతో వాళ్ళు తమ అధికారం నిలుపుకునేందుకు తిరిగి టిడిపిలోకి వస్తున్నారు.


రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలోను స్థానిక ఎమ్మెల్యే వారి దగ్గర డబ్బులు తీసుకుని.. తిరిగి వారికే టిక్కెట్లు ఇచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. దీనివల్ల నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎక్కడ గుర్తింపు ఉంటుంది.. వారి కష్టానికి ఎలా..? విలువ వస్తుంది అన్నది ఎవరు పట్టించుకోవటం లేదు. అసలు చంద్రబాబు ఇలాంటి నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఎందుకు..? ఒప్పుకున్నారు. ఇలా వైసీపీ నుంచి నాయకులను, కార్యకర్తలను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంత మాత్రం నచ్చటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp