తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత తొమ్మిది నెలల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ... ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తలలు పట్టుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా... కొంతమంది పావులు కదుపుతున్నారట. ఎలాగైనా రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి... అసలు సిసలైన కాంగ్రెస్ వాదులు ముఖ్యమంత్రి కావాలని కొంతమంది ప్లాన్ వేస్తున్నారట.


అయితే ఇలాంటి నేపథ్యంలో... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మనసులో మాట చెప్పేశారు. సీఎం ఉత్తంకుమార్ రెడ్డి అంటూ ఓ పబ్లిక్ మీటింగ్లో టంగ్ స్లిప్ అయ్యారు కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి. ఇక ఆ మాటను సవరించుకునేందుకు... తన నాలుక పైన మచ్చలు ఉన్నాయని... నేను చెప్పింది కచ్చితంగా జరుగుతుందన్నారు. అతి త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉత్తంకుమార్ రెడ్డి కాబోతున్నారని కూడా బాంబు పేల్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

 

ఆ సమయంలో తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... అతి త్వరలోనే... తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పిడి ఉంటుందని సమాచారం అందుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు.

 

మొదటి నుంచి రేవంత్ రెడ్డిని... భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తంకుమార్ రెడ్డి వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఈ ముగ్గురు  సోనియా గాంధీకి  మొదటి నుంచి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి వల్ల.. కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందని కూడా... వీళ్లు మొదటి నుంచి వాదిస్తున్నారు. అయితే వాళ్లు అన్నట్లుగానే రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి... 9 నెలల్లోనే తీవ్ర నష్టం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు... ఎంత మేరకు నిజమవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: