సాధారణంగా చాలామంది ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు అలివి కాని హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ హామీలను నెరవేర్చడానికి అస్సలు ఆసక్తి చూపకుండా ఉంటారు. అయితే స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మాత్రం చాలామంది ఎమ్మెల్యేలకు భిన్నమనే సంగతి తెలిసిందే. నియోజకవర్గం అభివృద్ధి కోసం బాలయ్య సొంత డబ్బులను సైతం ఖర్చు చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.
 
మరో విధంగా చెప్పాలంటే స్టార్ హీరో బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం రాత మార్చేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సైతం బాలయ్య హిందూపురం అభివృద్ధిని ఆపలేదు. హిందూపురంలో యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమల ఏర్పాటు దిశగా సైతం బాలయ్య అడుగులు పడుతున్నాయి. నియోజకవర్గంలో 1200 టిడ్కో ఇళ్ల నిర్మాణం 80 శాతం పూర్తి కాగా వాటిని వేగంగా పూర్తి చేసేలా బాలయ్య చర్యలు చేపడుతున్నారు.
 
హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని బాలయ్య భావిస్తుండగా రెండు అన్న క్యాంటీన్లను బాలయ్య ఓపెన్ చేయడం జరిగింది. హిందూపురం అభివృద్ధి కోసం బాలయ్య చంద్రబాబు నుంచి ఏకంగా 90 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నారంటే నియోజకవర్గం అభివృద్ధి విషయంలో బాలయ్య ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో అర్థమవుతుంది. హిందూపురం అంటే చంద్రబాబుకు ఎనలేని అభిమానమని బాలయ్య పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు.
 
మరికొన్ని గంటల్లో బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు మొదలుకానున్నాయనే సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగనుంది. బాలయ్య నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా మా దృష్టిలో బాలయ్య వయస్సు 16 సంవత్సరాలు మాత్రమేనని అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. హిందూపురం ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలబడే బాలయ్య లాంటి ఎమ్మెల్యే దొరకడం ఆ నియోజకవర్గ ప్రజల అదృష్టమేనని చెప్పవచ్చు. బాలయ్య సినిమాలు సైతం 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ హిట్స్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: