-బాలయ్య చేసే ప్రతి పనిలో ఆసరాగా..
- బాలకృష్ణ ధ్యాస శ్వాసగా..
- బాలయ్యతో వసుంధర ప్రయాణం మరువలేం..

నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో ఎంతో కోపం ఉన్నటువంటి హీరోలలో ఈయన కూడా ఒకరు.  ఎంత కోపం ఉంటుందో అంతగా పేదల కోసం తపించిపోతారు.  ఏ విషయానైనా ముక్కుసూటిగా చెప్పడంలో బాలకృష్ణ ముందుంటారు..ముఖ్యంగా చెప్పాల్సింది చిన్న పిల్లల స్వభవం గలవారని చెప్పవచ్చు.  అలాంటి బాలకృష్ణ ప్రతిక్షణం పేద ప్రజల కోసం పరితపిస్తాడు. ఓ వైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు తన హిందూపురం నియోజకవర్గంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. కాంట్రాక్టులు, వ్యాపారాలు వంటివి పెట్టి డబ్బు సంపాదించాలని ఆయనకు లేదు. తన సొంత డబ్బుతోనే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  అలాంటి  బాలకృష్ణ ఇంతటి సక్సెస్ వెనుక తన భార్య వసుంధర ఉందని చాలామందికి తెలుసు.  ఆయన చేసే ప్రతి పనిని ఆమె ప్రోత్సహిస్తూ ఆసరాగా బాసటగా నిలుస్తూ ఉంటుంది.  అలాంటి వసుంధర బాలకృష్ణ లు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మరి వీరి వివాహంలో జరిగినటువంటి ట్విస్టులు ఏంటి..ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 బాలయ్య వసుంధర వివాహం:
 ప్రస్తుతం బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుక నిర్వహిస్తున్నారు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు.. ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరవుతున్నారు.  అలాంటి బాలకృష్ణ 50 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా తన వివాహం గురించి కూడా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉన్నట్టు బాలకృష్ణ విజయం వెనుక కూడా  తన భార్య ఉంది. సుఖ దుఃఖాల్లో కూడా తోడునీడగా  నిలిచింది భార్య వసుంధర. వీరి వివాహం 1982లో జరిగింది.  వసుంధర దేవి తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరుగాంచిన వ్యాపారవేత్త కూతురు.శ్రీ రామదాసు ఆటో ట్రాన్స్పోర్ట్ ఎస్ ఆర్ ఎమ్ టి సంస్థ అధినేత  దేవరపల్లి సూర్యరావు గారి అమ్మాయి. (ఈయనను చౌదరి గారు అని కూడా పిలుస్తారు). వీరి సొంత ఊరు కాకినాడ. వందల కోట్ల ఆస్తిపాస్తులున్నటువంటి వీరి ఫ్యామిలీ  కోనసీమ జిల్లాలలో ఎంతో గౌరవం ఉంది. ఇప్పటికీ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎస్ఆర్ఎంటి సంస్థ దూసుకుపోతోంది. ఇక ఆయన కుమార్తె వసుంధర దేవి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె చదువు పూర్తవగానే బాలకృష్ణతో వివాహమైంది. వీరి పెళ్లికి ముందు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందట.


ఒకసారి కాకినాడలో రామ్ రహీం చిత్ర షూటింగ్ కోసం బాలకృష్ణ రిక్షా తొక్కుతూ ఉండగా, తన అత్తగారు చూశారట. అయితే ఆమెకు సినిమా షూటింగ్ అని తెలియక వసుంధర దేవి తల్లి అయ్యో పాపం రామారావు కొడుకేంటి ఇలా సైకిల్ తొక్కుతున్నారు.ఆయనకు ఇలాంటి గతి పట్టిందేంటి అనుకుందట. చివరికి బాలకృష్ణనే ఆమె ఇంటికి అల్లుడుగా వెళ్లడంతో అంతా అనుకోకుండా జరిగిపోయాయట. ఈ విషయాన్ని బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ విధంగా బాలకృష్ణకు మరియు వసుంధర దేవికి వివాహం జరిగింది. పెళ్లి నాటి నుంచి బాలకృష్ణకు అండగా నిలుస్తూ ప్రతి పనిలో సహకరిస్తూ వస్తుంది వసుందరా దేవి. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే బాలకృష్ణ ని ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకుంటుందట. అంతే కాదు తన పిల్లల బాధ్యతను కూడా పూర్తిగా తానే తీసుకొని ప్రయోజకుల్ని చేసింది. ఇక పెద్ద కుమార్తె బ్రాహ్మణి  నారా చంద్రబాబు ఇంటికి కోడలిగా వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఇక రెండవ కుమార్తె  తేజస్విని వైజాగ్ గీతం సంస్థల అధినేత వారసుడు శ్రీ భరత్ ను పెళ్లి చేసుకుంది. కుమారుడు మోక్షజ్ఞ త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమయ్యాడు.  ఈ విధంగా బాలకృష్ణ సినీ రాజకీయ విషయాల్లోనే కాకుండా కుటుంబాన్ని  చక్కదిద్దడంలో కూడా వసుంధర దేవి కీలకమైన పాత్ర పోషించి బాలయ్యకు తగిన భార్యగా నిరూపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: