వైసీపీలో ఒక్కో నాయకుడు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. పార్టీని వీడి వెళ్ళిపోతున్న వారి విషయంలో వారందరూ కూడా ద్రోహులు, అవకాశవాదులు.. వారు వెళ్లిపోవటం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు.. ఇలాంటి అలవాటైన డైలాగులతో నాయకులు ఎంతగా సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న.. ఒక పార్టీ నుంచి నాయకులు వరుసగా వెళ్ళిపోతున్నారు అంటే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. ఆ పార్టీ భవిష్యత్తు కష్టం అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళతాయి. అలాగే పార్టీ నాయకులకు సమాన ప్రాధాన్యం ఇవ్వటంలో వైఫల్యం జరుగుతుందన్న చర్చ కూడా జనాల్లోకి వెళుతుంది.


ఇప్పుడు వైసీపీలో ఇదే జరుగుతుంది. వైసీపీ అధినేత జగన్ కొద్దిగా చొరవ తీసుకుంటే పార్టీ నుంచే బయటకు వెళ్లకుండా కొంతమంది నాయకులను ఆపే ప్రయత్నం చేయవచ్చు. కానీ.. జగన్ పూర్తిగా చేతులు ఎత్తేశారు. చివరకు తనతో పాటు 15 ఏళ్ళ‌కు పైగా జర్నీ చేస్తూ తనకోసం జైలు శిక్ష కూడా అనుభవించిన మోపిదేవి వెంకటరమణ లాంటి నేతలు కూడా పార్టీ వీడి.. అందులోనూ తన రాజ్యసభ పదవిని వదులుకొని మరి బయటికి వెళ్లిపోతున్నా.. జగన్ అడ్డుకునే ప్రయత్నం చేయటం లేదు. అంటే జగన్ కే తన పార్టీ పట్ల నమ్మకం లేదా..? తన భవిష్యత్తు విషయంలో జగన్ కి కాన్ఫిడెన్స్ లేదా..? అన్న సందేహాలు ప్రజల్లో కనిపిస్తున్నాయి.


ఇక ఎంత లేదన్న రాజకీయ పార్టీలకు సొంత నిఘా వ్యవస్థ ఉంటుంది. జగన్ వైసిపి నిఘా నిద్దరోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరైనా ఒక నేత బయటకు వెళ్ళిపోతున్నారంటే.. ముందుగానే సంకేతాలు వస్తాయి. వాళ్లను పార్టీ అధినేత నేరుగా పిలిపించుకుని బుజ్జగించుకుని పార్టీ వీడకుండా ఆపే ప్రయత్నం చేయవచ్చు.  వైసీపీలో ఇప్పుడు నిఘా విభాగం పూర్తిగా నిద్రపోతున్న పరిస్థితి. అందుకే కీలక నేతలు వరుసగా పార్టీని వీడి వెళ్లిపోతున్న జగన్ కి తెలియటం లేదు. జగన్ కూడా పట్టించుకోవడం లేదు. ఎవరు..? పార్టీ వీడియో వెళ్లకుండా కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇక అందరూ వెళ్లిపోయాక జగన్ ఒక్కడే మిగిలి పిసుక్కోవ‌డ‌మే తప్ప చేసేదేం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: