- ఇగోతో ఆపే ప్రయత్నం కూడా చేయని పార్టీ అధినేత
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) .
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైసిపి నుంచి పలువురు కీలక నేతలు వరుసగా పార్టీ వీడి వెళ్లిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు , చివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు.. ఎమ్మెల్సీలు, ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. కొద్దిరోజుల వ్యవధిలోనే కిలారు వెంకట రోశయ్య, మద్దాలి గిరిధర్ రావు , ఆళ్ళ నాని .. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు.. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
ఇక ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ కూడా ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పాలన్న నిర్ణయానికి వచ్చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇదే జాబితాలో మరో ఆరుగురు రాజ్యసభ సభ్యులతో పాటు.. ఆరేడుగురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వైసిపి వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. అసలు రాజ్యసభ సభ్యులుగా ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలోనే.. ఆరేడుగురు పార్టీని వీడాలన్న నిర్ణయం తీసుకోవడం ఏంటి.. ? ఇక జగన్.. ఎమ్మెల్సీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మండలిలో ప్రభుత్వాన్ని ఏకరువు పెట్టాలని కలలు కన్నారు.
మరి ఎమ్మెల్సీలు కూడా చేజారి పోతున్నా.. జగన్ ఎందుకు వారిని ఆపే ప్రయత్నం చేయటం లేదు..? అంటే జగన్ కు బాగా ఇగో అడ్డు వచ్చేస్తుందట. తాను పదవులు ఇచ్చినప్పుడు వాళ్లంతా తనను బతిమిలాడుకున్నారు. అలాంటి టైం లో తాను పదవులు ఇచ్చిన వారిని పార్టీ మారవద్దని తాను బతిమిలాడుకోవడం ఏంటి.. ? అన్న ఇగో తో జగన్ పంతానికి పోతున్నారని .. అందుకే వరుస పెట్టి పార్టీ ఎమ్మెల్యేలు.. పార్టీ కీలక నాయకులు బయటకు పోతున్న అస్సలు పట్టించుకోవడంలేదని.. వైసిపి వర్గాల్లో చర్చ జరుగుతుంది.