ఛాన్స్ దొరికితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కూటమి పార్టీలు కాస్త టెన్షన్ లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. 2029లో కూడా టీడీపీ కూటమి పోటీచేస్తుందని పవన్ ఇప్పటికే తేల్చి చెప్పేశారు. టీడీపీతో పొత్తు మరో పదేళ్ల పాటు కొనసాగుతుందని అన్నారు. అంటే 2029లో కూడా వైసీపీ సోలోగానే బరిలో నిలవనుంది. మరోవైపు పవన్ కూడా వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఆనాడు తనకు జరిగిన అవమానాలను, వైసీపీ చేసిన పనులను తలచుకుని జనసేనాని ఫైర్ అవుతూ వైసీపీకి వ్యతిరేకంగా పనులు చేస్తూ వస్తున్నారు. 2029లో వైసీపీకి టీడీపీ కూటమి గట్టి ఫైట్ ఇస్తుందని అందరూ అనుకుంటున్నా ఎన్నికల టైంకి అది మారే అవకాశం ఉంది.
ఇప్పుడు వైసీపీ పరిస్థితి చూస్తే పేకమేడలా కూలుతోందని తెలుస్తోంది. వైసీపీలో ఇప్పటికే జంపింగ్‌లు స్టార్ట్ అయ్యాయి. బడా నాయకులు అంతా పార్టీ ఫౌండేషన్ నుంచి తప్పుకుంటూ వస్తున్నారు. వైసీపీకి ఒక్కొక్కరే రాజీనామా చేస్తూ వస్తుంటే టీడీపీ ఏమోకానీ జనసేన మాత్రం ఫుల్ ఖుషీలో ఉంది. వైసీపీ ఎంత డల్ అవుతుంటే జనసేన అంత హ్యాపీగా ఫీల్ అవుతోంది. జనసేనకు గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో మంచి పట్టు ఉండటం మరింత ప్లస్ అని చెప్పాలి. రాయలసీమలో టీడీపీ బలంగా ఉంది. కానీ అన్నిచోట్లా వైసీపీకి సంబంధించిన ఓటర్లున్నారు. కాబట్టి వారిని నిలబెట్టుకోవాల్సిన అవసరం వైసీపీకి ఉంది. సైలెంట్‌గా ఉండకుండా అలా ఒక్కొక్కరినీ కలుపుకుంటూ పోతేనే వైసీపీకి మరింత బలం కలగనుంది.