రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వారిద్దరిపైనే చర్చ జరుగుతోంది. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఒకప్పుడు సీఎం కుర్చీపై పాలన సాగించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇద్దరూ మాజీ సీఎంలు అయ్యారు. 2019లో ఏపీలో జగన్ సీఎం అయ్యాక తెలంగాణలో కేసీఆర్ రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరిపై అభిమానం ఎక్కువ. అయితే ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. సిట్టింగులకు సీట్లిచ్చి కేసీఆర్ ఓడితే వైసీపీ నేతల పిల్లలకు సీట్లిచ్చి జగన్ ఓటమిపాలయ్యారు. రెండు పార్టీలు బాగా కష్టపడ్డాయి. అయితేమాత్రం బీఆర్ఎస్, వైసీపీలు ఓడాయి.

ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఏపీలో కూడా వైసీపీ నేతలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఏపీలో కూడా వైసీపీ నుంచి ఒక్కొక్కరూ జంప్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అధికారంలోకి తిరిగి వైసీపీ రాదని తెలిసి వారంతా మెల్లగా జారుకుంటున్నారు. వైసీపీ నుంచి వెళ్లేవారిని ఎంత బుజ్జగించినా వారు వెళ్లిపోతారని తెలిసి పార్టీ అధిష్టానం ఏమీ చేయడం లేదు. ఇటు తెలంగాణలో కేసీఆర్ కూడా తమ పార్టీ నేతలతో చర్చలు జరుపుతూ వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. దీంతో రెండు పార్టీల పరిస్థితి ఒకేలా కనిపిస్తోంది. ఒకే పడవపైకి రెండు పార్టీలు వచ్చి చేరాయని అందరూ అంటున్నారు.

తెలంగాణ సాధనకై బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. అది పుడుతూనే ఓ ఉద్యమ పార్టీగా అవతరించింది. కేసీఆర్‌ను సీఎం చేసింది. వైసీపీ కూడా వైఎస్ఆర్ ఆశయాలతో పుట్టింది. ఏపీలో వైఎస్ఆర్ ఓ భావోద్వేగం అని చెప్పాలి. వైఎస్ఆర్ పై ప్రేమ ఇంకా చావలేదు. వారి ప్రేమనంతా జనాలు జగన్‌పై చూపిస్తున్నారు. వైఎస్ఆర్ తర్వాత జగన్‌కి ఛాన్స్ ఇవ్వాలని అందరూ భావించారు. అందుకే 2019లో జనాలు జగన్‌కి పట్టం కట్టారు. వైఎస్ఆర్ రుణం తీర్చుకున్నారు. దీంతో ఎమోషనల్ బ్యాగ్రౌండ్‌తో పుట్టిన రెండు పార్టీలు ఇప్పుడు చప్పబడిపోయాయి. అధికారం లేక అల్లాడిపోతున్నాయి. ఒకే పడవపై రెండు పార్టీలు ప్రయాణిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: