ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ పరిస్థితి... అటు ఇటుగా ఉంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోవడంతో... అందులో ఉన్న నేతలందరూ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అవకాశాలు ఇచ్చిన పార్టీలకు జంప్ అయ్యేందుకు కొంతమంది రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే చాలామంది.. నేతలు వైసీపీని వీడి బయటికి వెళ్లారు. తాజాగా రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు.

 

అదే సమయంలో వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేశారు. అంతేకాదు.. వీరి ఎపిసోడ్ ముగియకముందే ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. పార్టీలో ఇంత సంక్షోభం ఉన్న నేపథ్యంలో..  బాలీవుడ్ హీరోయిన్ వివాదం వైసీపీ మెడకే చుట్టుకుంది. కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నేత కారణంగా... బాలీవుడ్ ఇష్యూ మొత్తం జగన్ మోహన్ రెడ్డి పార్టీ పైకి వచ్చింది. ప్రస్తుతం విద్యాసాగర్ వైసీపీలో లేకపోయినా గతంలో ఉన్నాడని తెలుగుదేశం ఆరోపణలు చేస్తుంది.

 

ఇక లేటెస్ట్ గా గుడివాడలోని గుడ్లవల్లేరు  ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు పెట్టి... బాలికల 300 వీడియోలు తీశాడు ఓ విద్యార్థి. ఈ సంఘటన కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రజలకు ప్రతిపక్ష నేతగా అండగా ఉండాల్సిన జగన్ మోహన్ రెడ్డి... లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.  ఏపీ ప్రజలను ఓదార్చాల్సింది పోయి... విదేశీ టూర్లకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

 

సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే దాదాపు 20 రోజులకు పైగా విదేశీ  టూర్కె పరిమితం కానున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే కోటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతులు వచ్చాయి. సెప్టెంబర్ మూడవ తేదీన ఫ్లైట్ కూడా ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే వైసీపీ పార్టీ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమని... కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: