వైసీపీలో సంక్షోభం కొనసాగుతోంది. రోజుకో ఇద్దరు ముగ్గురు నేతలు తమ పదవులు వదులుకుంటున్నారు. ఇది నిజంగా ఏపీలోనే కాదు దేశంలోనే కొత్త రాజకీయం. ఉన్న పదవిని వదులుకొని కొత్త పదవి వస్తుందో రాదో అని తెలియకుండా రిస్క్ చేస్తూ కూడా వైసీపీ గోడ దూకి పోతున్నారు అంటే చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం.
అయితే మాత్రం జగన్ వీటి మీద పెద్దగా పట్టించుకోకుంటున్నారా అన్న చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. నిన్నటికి నిన్న ఇద్దరు రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే 24 గంటలు గడవకుండానే మరో ఇద్దరు ఎమ్మెల్సీలు తమ పదవులు వదులుకుంటూ వైసీపీకి షాక్ ఇచ్చారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది. పార్టీలో వారికి వచ్చిన బాధ ఏంటి వారు పోతే పోయారు. మిగిలిన వారి మనో భావాలు ఎలా ఉన్నాయి. పార్టీ క్యాడర్ డీ మోరలైజ్ అవుతున్నారా ఏమిటి అన్నది వైసీపీ ఆరా తీయాల్సిన పరిస్థితి ఉంది అని అంటున్నారు.
కానీ జగన్ మాత్రం ఈ వలసలను లైట్ తీసుకున్నట్లు అర్థం అవుతుంది. ఈ మొత్తం వ్యవహారాల పట్ల అంతగా దృష్టి పెట్టినట్లుగా కనిపించడం లేదు. మరో వైపు చూస్తే బాలీవుడ్ నటీమణి తనకు వైసీపీ ప్రభుత్వంలో వేధింపులు ఎక్కువ అయ్యాయని వేలెత్తి చూపిస్తున్నారు. ఆమె ఏకంగా ముంబయి నుంచి వచ్చి మరీ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
ఇది రచ్చ అవుతోంది. వైసీపీ ఇమేజ్ ని దెబ్బతీస్తుంది. ఇలా ఏపీలో పార్టీకి వరుస ఇబ్బందులు తగులుతున్న వేళ జగన్ సెప్టెంబరు 3 నుంచి 25 వరకు ఏకంగా విదేశీ టూర్లు చేయడం మంచిదేనా అన్న చర్చ వస్తోంది. పార్టీలో మరో ఆల్టర్ నేషన్ నాయకత్వం కానీ పార్టీ యంత్రంగం కాని సెటప్ చేయలేదు. జగన్ వెళ్లే వారిని లైట్ తీసుకున్నారా. వెళ్లేవారిని బుజ్జగించడం వల్ల ఉపయోగం లేదని భావిస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. మరోవైపు జగన్ లండన్ ఫ్లైట్ ఎక్కగానే వైసీపీలో సంక్షోభం మరింత ముదురుతుందా అన్న ప్రచారం కూడా సాగుతోంది. మరి వైసీపీ అదినేత ఆలోచనలు ఏంటో చూడాలి.