పలు ఆధారాలతో ఆమె విజయవాడకు చేరినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే సజ్జల రామకృష్ణ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కదంబరి చేసిన వ్యాఖ్యలను సజ్జల రామకృష్ణ ఖండించడం జరిగింది.. ఈ సందర్భంగా తన పైన కేవలం అసత్య ప్రచారాలు చేస్తున్నారని అలాంటి వారి పైన కచ్చితంగా చర్యలు తీసుకుంటానని కూడా తెలిపారు. ఇందులో భాగంగా ముంబై నటికి వేధింపులు సజ్జల సహాయం పేరుతో అనే విధంగా ఒక కథనం కూడా ప్రచురించిన పత్రికలు అంతేకాకుండా ఆ విధంగా మాట్లాడిన వారందరి పై కూడా పరువు నష్ట ధావ వేస్తానంటూ తెలియజేశారు.
ఈ సందర్భంగా అటు దినపత్రికకు ఇటు వర్లరామయ్యకు కూడా సజ్జన లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. పత్రికలలో కథనాన్ని అడ్డుపెట్టుకొని చాలామంది టిడిపి నాయకులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం రాగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విధంగా ఆరోపిస్తున్నారు. తన పేరును చెడగొట్టేందుకే టిడిపి పార్టీ ఈమెను రంగంలోకి తీసుకువచ్చిందని తెలియజేశారు.. మేని పోస్టులో ఇచ్చిన హామీలను అమలు చేయక .. ప్రజలను ఏ మార్చే ఎందుకే ఇలాంటివన్నీ చేస్తున్నారనే విధంగా తెలియజేస్తున్నారు.