* ఫ్యాక్షన్ చిత్రాలకు ఊపిరి పోసిన బాలయ్య ‘సమర సింహారెడ్డి'

* అప్పట్లో బాలయ్య మాస్ డైలాగ్స్ కి షేక్ అయిన థియేటర్స్


* ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన ' సమర సింహా రెడ్డి '

* బాక్సాఫిస్ వద్ద ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం.. అప్పట్లో సంచలనమే

నందమూరి నటసింహం బాలకృష్ణ స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఉత్సాహంతో ఊగిపోతారు. టాలీవుడ్ లో ఏ హీరోకి లేని మాస్ ఇమేజ్ బాలయ్య సొంతం.. ఆయన చెప్పే డైలాగ్స్ ఊర మాస్ గా ఉంటాయి.. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా బాలయ్య క్రేజ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు.. బాలయ్య ఆయన కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించారు.. అయితే బాలయ్య కు తిరుగులేని మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన సినిమా.. సమర సింహారెడ్డి.. మాస్ దర్శకుడు బీ. గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.. అప్పటివరకు ఏ హీరో చేయని పక్కా మాస్ రోల్ లో బాలయ్య నటించారు..


లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత బాలయ్య, బీ. గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన మూడో సినిమా సమర సింహారెడ్డి..రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన కథను అందించారు..ఈ సినిమాను రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలని వారు భావించారు..వెంటనే పరుచూరి బ్రదర్స్ ఈ స్టోరీ వినిపించగా వారు ఈ స్టోరీలో కొన్ని చేంజెస్ చెప్పారు..బ్రహ్మానందం, సత్యన్నారాయణ పాత్రలు రెండు కూడా కథలో లేవు. కానీ బీ.గోపాల్ పట్టుబట్టి వారి పాత్రలు చేయించడం జరిగింది.. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ ఆలోచన కూడా బి. గోపాల్ దే..క్లైమాక్స్ బి. గోపాల్ లో గొప్ప దర్శకుడిని బయటపెడుతుంది..ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ సమరసింహం.. కానీ పరుచూరి గోపాల్ కృష్ణ ఈ సినిమాకు ‘సమర సింహారెడ్డి ‘ అని పెడితే బాగుంటుంది అని చెప్పారు.. దర్శకుడు బి. గోపాల్ కూడా అందుకు అంగీకరించడంతో ఈ సినిమాకు సమర సింహారెడ్డి అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ అయింది..షూటింగ్ మొదలైంది.. హీరోయిన్ లుగా రాశి, సంఘవి, అంజ జవేరి ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమాలో సీతాకోక చిలుక సీన్ నచ్చక రాశిసినిమా నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో సిమ్రాన్ ఈ సినిమాలో నటించారు. అంతా బాగానే ఉంది.. ఈ సినిమాకు బాలయ్య పవర్ ఫుల్ ఎలివేషన్ పడాలి అంటే అదిరిపోయే బీజిఎం ఉండాలి..దాని కోసం మణిశర్మ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు..


బాలయ్య,మణిశర్మ కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ మూవీ.. సినిమాకు మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయింది..అలా సమర సింహారెడ్డి 1999 జనవరి 13 న రిలీజ్ అయింది.అదే సమయంలో చిరంజీవి ‘స్నేహం కోసం ‘ సినిమా రిలీజ్ అయింది. బాలయ్య సమర సింహారెడ్డి సినిమాపై పెద్దగా అంచనాలు లేవు..కానీ సినిమా చూసాక అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం సినిమారా బాబు మాస్ ఎలివేషన్స్ తో మెంటల్ ఎక్కించారు..ఈ సినిమాలో హైలైట్ సీన్స్ ఇప్పటికీ ఎంతో పాపులర్ అని చెప్పాలి..ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది.. ఫ్యాన్స్ కానీ వారు కూడా ‘జై బాలయ్య’ అనేలా చేసింది..టాలీవుడ్ లో సమర సింహారెడ్డి ఫ్యాక్షన్ సినిమాలకు ఊపిరి పోసింది.బాక్సఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు..మొదటి సారి 20 కొట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది..10,15 రూపాయల టికెట్ రేట్స్ తో దాదాపు 16 కొట్ల షేర్ కలెక్ట్ చేసింది..73 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకున్న తొలిసినిమాగా ‘ సమరసింహారెడ్డి నిలిచింది..

మరింత సమాచారం తెలుసుకోండి: