సినిమా ఇండస్ట్రీలో బాలయ్య ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. తనకు నచ్చిన విధంగా ఉండటానికి బాలయ్య ఇష్టపడతారు. బాలయ్య తన సినీ కెరీర్ లో టచ్ చేయని జానర్ లేదనే సంగతి తెలిసిందే. బాలయ్య మాస్ డైలాగ్స్ చెబితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనని చెప్పవచ్చు. స్టార్ హీరోలు చెయ్యడానికి ఇష్టపడని కురూపి, అఘోరా పాత్రల్లో సైతం నటించి మెప్పించడం బాలయ్యకే సాధ్యమైంది.
 
బాలయ్య "శరణమా రణమా" అనే గ్రాంథికం డైలాగ్ చెప్పినా "దబిడి దిబిడే" అంటూ మాస్ డైలాగ్ చెప్పినా తనలా ఎవ్వరూ చెప్పలేరు అనేంత అద్భుతంగా చెబుతారు. డైలాగ్ డెలివరీని ఇష్టపడి బాలయ్యకు ఫ్యాన్స్ అయిన వాళ్లే ఎంతోమంది ఉన్నారు. "కత్తులతో కాదు కంటిచూపుతో చంపేస్తా", "కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు", "ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు" డైలాగ్స్ బాలయ్య కెరీర్ లో స్పెషల్ గా నిలుస్తాయి.
 
"నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ ని అనుకున్నావా బే, షూటర్ ని కాల్చిపారేస్తా", నాకు ఎమోషన్స్ ఉండవ్.. ఫీలింగ్స్ ఉండవ్.. కాలిక్యులేషన్స్ ఉండవ్.. మానిప్యులేషన్స్ ఉండవ్", "ఉష్.. సౌండ్ చేయకు కంఠం కోసేస్తా", "చూడూ.. ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవ్ మాడిపోతావ్", "నేది మొదలుపెట్టను మొదలుపెడితే వదిలిపెట్టను" లాంటి డైలాగ్స్ బాలయ్య కెరీర్ లో స్పెషల్ గా నిలిచాయి.
 
"ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్ నేను ఒకడికి ఎదురు వెళ్లినా వాడికే రిస్క్ తొక్కి పడేస్తా!" అంటూ లెజెండ్ లో బాలయ్య చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. నటుడిగా ఎన్నో మెట్లు ఎదిగి ఎన్నో విజయాలను అందుకుంటున్న బాలయ్య భవిష్యత్తులో కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో సైతం డైలాగ్స్ అదిరిపోనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: