ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో.. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత... ఏపీలో ఉన్న ప్రభుత్వ పదవులను మూడు పార్టీలు పంచుకున్నాయి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అదే సమయంలో జనసేన పార్టీలో మూడు కలిసి... పదవులను పంచుకోవడం ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది.

 

అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.  వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న నేతల పరిస్థితి ఏంటని ఇప్పుడు చర్చ జరుగుతోంది. నాలుగు రోజుల కిందట వైసీపీ పార్టీకి అలాగే రాజ్యసభ పదవికి ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తన పదవికి రాజీనామా చేయకముందే తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నట్లు ప్రకటించేశారు.  ఇక మరో 10 రోజుల్లోపే ఆయన తెలుగుదేశం కండువా కప్పుకునే ఛాన్స్ ఉంది.


ఇలాంటి నేపథ్యంలో... తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో... మోపిదేవి వెంకటరమణకు కీలక పదవి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినందుకుగాను... మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సతో పాటు మంత్రి కూడా కానున్నారట. ఒకవేళ ఎమ్మెల్సీ పదవి కుదరకపోతే.... కేబినెట్ హోదా ఉన్న  ప్రభుత్వ సలహాదారు  పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

కేంద్రంలో బిజెపికి అలాగే తెలుగుదేశంకు బలం ఉండేలా.. రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యేలా... మోపిదేవి వెంకట రమణ స్కెచ్ వేశారట.  ఇందులో భాగంగానే తన పదవితో పాటు బీద మస్తాన్ రావు పదవిని త్యాగం చేసేలా మోపిదేవి స్కెచ్ వేసినట్లు సమాచారం. అయితే ఇంతటి... పెద్ద త్యాగం చేసిన మోపిదేవి వెంకట రమణకు... తెలుగు దేశం కూటమిలో రాజయోగం తప్పదని అంటున్నారు. మరి ఆయనకు ఎలాంటి పదవి వస్తుందో చూడాలి. మొత్తానికి తెలుగు దేశం ప్రభుత్వం మోపిదేవి వెంకట రమణకు మంచి పోస్ట్ వస్తుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: