ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక మద్యం పాలసీకి తీసుకుస్తోంది.‌ ఈ నేపథ్యంలో పాత ప్రభుత్వ మద్యం షాపులన్నీ కూడా మూసేస్తారని.. అందులో పని చేస్తున్న ఔట్సోర్సింగ్, ఇతర ఉద్యోగులందరినీ కూడా పనిలోంచి తీసేస్తారని ఉద్యోగాలు ఇక ఉండవని ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక మద్యం పాలసీకి మంత్రులతో కూడిన కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్ నుంచి కొత్త మద్యం షాపులు వస్తాయని.. మద్యం పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాత మద్యం షాపులు‌… గవర్నమెంట్ షాపుల్లో పనిచేస్తున్న వారందరి గుండెల్లో గుబులు పట్టుకుంది.ఏపీలో గత ఐదు సంవత్సరాలుగా అభాసుపాలైన మద్యం విధానంలో మార్పులు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో ఉన్న మద్యం విధానాన్ని ఎక్సైజ్ అధికారులు అధ్యయనం చేసి ఒక నివేదికను రూపొందించారు. తెలంగాణ తరహా మద్యం విధానమైతే మంచిదని భావించి దాన్నే అమలు చేయబోతున్నారు. అక్టోబరు నుంచి మద్యం రిటైల్ షాపులను ప్రయివేటు వ్యక్తులద్వారా నిర్వహింపచేస్తారు. దీనికోసం టెండరు ప్రక్రియ నడుస్తుంది. త్వరలోనే విధివిధానాలను ఖరారు చేయబోతున్నారు.గత ప్రభుత్వ హయాంలో తమను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. కానీ.. ఇప్పుడు తమ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే.. 15 వేల మంది కాంట్రాక్ట్‌, ఔవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు రోడ్డున పడతారని వాపోతున్నారు. తమ విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అందుకే సెప్టెంబర్‌ 7 నుంచి మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయానికొచ్చారు.అక్టోబర్‌ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అక్టోబర్‌ 1 వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ప్రకటించారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో భారీగా అవినీతికి పాల్పడిందని.. ఈసారి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా.. కొత్త మద్యం పాలసీలో మార్పులు, చేర్పులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: