వీరిలో వెంకటరమణకు మళ్ళీ రాజ్యసభ కాకుండా ఎమ్మెల్సీ ఇస్తారని తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం నుంచి మోపిదేవి ని మండలికి పంపుతారని అంటున్నారు. ఇక మోపిదేవి వెంకట రమణకు ఎమ్మెల్సీ ఇస్తే.. మస్తాన్ రావు స్థానంలో, ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో.. ఎవరిని ఎంపిక చేస్తారు.. అన్న ప్రచారం కూడా ఉంది. ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలు టీడీపీకే దక్కనున్నాయి. ఇందులో ఒకటి జనసేన కోరుతుంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును రాజ్యసభకు పంపించాలన్న వ్యూహం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
వాస్తవానికి మొన్న ఎన్నికలలోనే నాగబాబు ఎంపీగా పోటీ చేయాలని అనుకొని.. సీట్ల సర్దుబాటులో తనకు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో త్యాగం చేశారు. ఇక గుంటూరు నుంచి వరుసగా తెలుగుదేశం పార్టీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్.. మొన్న ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆయనకు బదులుగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు జయదేవ్‌ని కూడా రాజ్యసభకు పంపుతారని.. జయదేవ్ కూడా తనకు రాజ్యసభ కావాలని చంద్రబాబు దగ్గర పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఇద్దరు పేర్లు కూటమి నుంచి రాజ్యసభ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న చంద్రబాబు నిర్ణయం అంతిమంకానుంది.