ఈ మధ్యకాలంలో వైయస్ షర్మిల ఎలాంటి విషయాలనైన సరే యాక్టివ్ గా ఉంటూ రాజకీయాల పరంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా తన అన్న మోహన్ రెడ్డి విషయాల పైన కూడా అప్పుడప్పుడు ఫైర్ అవుతూ ఉంటుంది షర్మిల. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు పైన పలు రకాల వ్యాఖ్యాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా వైఎస్సార్ పేరును తొలగించిన చంద్రబాబు పైన షర్మిల పలు రకాల వ్యాఖ్యలు చేసింది


గతంలో వైయస్సార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఎన్టీఆర్ పేరుని తీసేసి వైఎస్సార్ పేరును పెట్టడంతో చాలామంది విమర్శించారు.. ఇప్పుడు మళ్లీ వైయస్సార్ పేరు తొలగించి చంద్రబాబు, జగన్ చేసిన తప్పు చేస్తున్నాడు జగన్ గతే పడుతుంది అంటూ అర్థం వచ్చేలా ఒక సంచలన పోస్ట్ షేర్ చేసింది షర్మిల.. వైద్య విద్యా రంగాలకు ఎన్టీఆర్ పేరు తొలగించిన మాజీ సీఎం జగన్ ఆరోజు ఒక పెద్ద తప్పు లాంటిది చేశారు.. ఇప్పుడు అదే బాటలో మీరు కూడా నడుస్తున్నారు అంటూ చంద్రబాబు పైన ఫైర్ అయ్యింది షర్మిల.


వైయస్సార్ పేరును తొలగించడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది అంటు తెలిపారు.. వైయస్ఆర్ అయినా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా కృషి చేశారని తమ పాలనలో తమదైన ముద్ర వేసిన వాళ్లే అంటూ తెలిపింది.రాజకీయాలకు అతీతంగా ఇద్దరిని చూడాలి తప్పితే ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదు అంటూ తెలుపుతోంది షర్మిల. వైయస్సార్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ఫీజు రిమెంబర్స్, పెన్షన్, రుణమాఫీ వంటి పథకాలు ఈ దేశానికే ఆదర్శమని.. వైయస్సార్ ఏదో ఒక పార్టీకి సొంతం కాదని తెలుగు ప్రజల ఆస్తి తెలుగు వారి గుండె చప్పుడు అంటూ తెలిపింది. ఇప్పటికీ ఆయన పేరు వింటే.. ఎంతోమంది తెలుగు ప్రజలను చిరస్థాయి ముద్ర వేసుకున్నారని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: