- గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని బాబు నిర్ణయం
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) .
వైసీపీకి చెందిన మాజీ మంత్రి తాజా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ వైసీపీతో పాటు.. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయినా తాను త్వరలోనే టిడిపిలో చేరుతున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. త్వరలో టిడిపిలో చేరుతున్న వెంకటరమణకు.. టిడిపి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్టు తెలిసింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మోపిదేవి వెంకటరమణకు 2019 ఎన్నికలలో రేపల్లె సీటు ఇవ్వగా.. ఆయన ఓడిపోయారు. జగన్ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన.. రేపల్లెలో మోపిదేవి ఓడిపోయారు.
జగన్ మోపిదేవికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి క్యాబినెట్‌లో తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత సమీకరణల పరంగా మోపిదేవిని రాజ్యసభకు కూడా పంపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మోపిదేవి హవా మామూలుగా ఉండేది కాదు. అయితే మొన్న ఎన్నికలలో రేపల్లె సీటు ఇవ్వమని చెప్పిన జగన్ పట్టించుకోలేదు. అప్పటినుంచి మోపిదేవి, జగన్ తో ఎడమొఖం పెడమొఖం గా ఉంటూ వచ్చారు. ఇక ఇప్పుడు మోపిదేవి టిడిపిలో చేరుతున్నారు.
కచ్చితంగా రేపల్లెలో వరుసగా మూడుసార్లు గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే... మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కాదని.. మోపిదేవికి ఎమ్మెల్యే సీటు ఇచ్చే సీన్ లేదు. అయితే అధికార పార్టీలో ఉన్నానన్న సంతృప్తి ఒకటి మాత్రమే మోపిదేవికి మిగులుతుంది. అయితే గవర్నర్ కోటాలో కాళీ అయ్యే ఒక ఎమ్మెల్సీ స్థానం ఉంది. ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని మోపిదేవికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ మంత్రిని చేసి ఆ తర్వాత రాజ్యసభకు పంపితే.. ఇప్పుడు మోపిదేవి పార్టీ మారి చంద్రబాబు దగ్గర పనిచేస్తూ కేవలం ఎమ్మెల్సీతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.