- పులివెందుల మున్సిపాల్టీని టార్గెట్ చేసిన కూట‌మి స‌ర్కార్

- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) .

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల చుట్టూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి. తాజాగా జగన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ప్రజలను కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకుంటారని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉన్న మరో కీలకమైన విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. పులివెందుల మున్సిపాలిటీ చుట్టూ ఇటీవల రాజకీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీ కూడా వైసిపి నుంచి చేజారుతుందని కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట.


ఇక్కడ వైసిపి నాయకులు, వైసిపి కౌన్సిలర్లు కూడా టిడిపి టచ్‌లోకి వెళ్లారన్నది ప్రధాన విషయం. కడప జిల్లాకు చెందిన టిడిపి కీలక నేతలు, మంత్రులు పులివెందుల మున్సిపాలిటీ పై కన్నేసారన్నది వాస్తవం. చిత్తూరు, విశాఖ మాదిరిగానే పులివెందులలో కూడా కూటమి పార్టీలు జెండా ఎగరవెయ్యాలన్న లక్ష్యంతోనే పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం విశ్వ‌ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే పులివెందుల మున్సిపల్ చైర్మన్, వైస్‌ చర్మన్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఇక్కడ క్యాంపు రాజకీయాలు చాలా సీక్రెట్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది.


ఈ క్రమంలోనే జగన్ కూడా నేరుగా రంగంలో దిగినట్టు తెలుస్తోంది. జగన్‌ను పులివెందుల మున్సిపాలిటీ.. వైసీపీ నుంచి చేజారి పోకుండా కాపాడుకునేందుకు కౌన్సిలర్లతో భేటీ అవడంతో పాటు.. వారికి కావలసిన తాయిలాలు ఇవ్వడంతో పాటు.. బతిమిలాడుకోవడం ఇలా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అందుకే జగన్ బయటకు రావటం లేదు. ఇలాంటి టైంలో కూడా పులివెందుల నియోజకవర్గ పర్యటన పెట్టుకోవడం వెనక అసలు ఉద్దేశం ఇదేనని.. పులివెందుల మున్సిపాలిటీ తమ కుటుంబం నుంచి చేజారకుండా కాపాడుకోవడాని కే అన్న ప్రచారం వైసిపి వర్గాల్లోనే వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: