- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) .

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విప‌క్ష వైసీపీ కి వ‌రుస పెట్టి సాకుల మీద షాకులు త‌గులుతున్నాయి . వైసీపీ నుంచి ఎప్పుడు ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారో కూడా అర్థం కావ‌డం లేదు. ఈ క్ర‌మంలో నే వైసీపీ నుంచి రాజ్యసభ , ఎమ్మెల్సీలు .. రాజీనామాలు చేస్తున్నారు.. ఇది కొంత కాలంగా కంటిన్యూ అవుతూనే వ‌స్తోంది. అయితే వారికే ఆ పదవులు ఇచ్చే పరిస్థితి లేదన్న వాదన కూడా న‌డుస్తోంది. కొంత మంది పార్టీ వీడి మ‌రో పార్టీలో చేరినా కూడా వారికి వారి ప‌ద‌వులు ఇచ్చే ప‌రిస్థితి లేద‌నే అంటున్నారు.


ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వం లో ఎమ్మెల్సీ గానే కాకుండా మంత్రి గా కూడా ఉన్నారు మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌. ఆ త‌ర్వాత జ‌గ‌న్ మోపిదేవి ని రాజ్య‌స‌భ‌కు పంపారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న రేప‌ల్లె అసెంబ్లీ సీటు ఆశించారు. జ‌గ‌న్ ఇవ్వ‌లేదు.. చివ‌ర‌కు త‌న కుటుంబానికి అయినా ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ ను కోరినా అస్స‌లు ఒప్పుకోలేదు. దీంతో మోపిదేవి పార్టీకి రాజీనా మా చేయ‌డంతో పాటు త‌న ఎంపీ ప‌ద‌వి కూడా వ‌దులుకున్నారు.


ఇక ఇప్పుడు మోపిదేవికి ఆ రాజ్య‌స‌భ సీటు తిరిగి ఇవ్వ‌ట్లేద‌ని అంటున్నారు. ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఖాళీ గా ఉన్న ఎమ్మెల్సీ ప‌ద‌వి మోపిదేవికి ఇస్తార‌ని అంటున్నారు. అలాగే పులివెందుల లో వైసీపీ అధినేత జ‌గ‌న్ పై పోటీ చేసిన బీ టెక్ ర‌వి కి కూడా ఈ సారి ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని బాబు నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. గ‌తంలో ర‌వి విశాఖ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసి వైఎస్ . వివేకా నంద రెడ్డిపై విజ‌యం సాధించారు. ఇప్పుడు మ‌రోసారి జ‌గ‌న్ ను పులివెందుల‌లో ధీటుగా ఎదుర్కొనేందుకే ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: