కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు, కయ్యాలు, అసూయ, అణచివతే.. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. దేశానికి ఫ్రీడం సాధించిన పార్టీలో ఉన్న ఫ్రీడంతో నేతల క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తారు అనే అపవాదు కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే ఆ పార్టీలో కయ్యాలు నిరంతర ప్రక్రియ. పార్టీలో ఒక లీడర్ ఎదుగుదలను ప్రోత్సహించే వారికన్నా ఓర్వలేని నేతలే ఎక్కువగా ఉంటారు.


అందుకే ఎదిగే నేతలు.. అనేక ఇబ్బందులు పడుతుంటారు. వాటిని అధిగమించిన వారే పార్టీ అధ్యక్షులిగా, సీఎంలుగా నిలదొక్కుకుంటారు. లేదంటే రోశయ్యలా తప్పుకుంటారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు ఉంది. కానీ రెండు ఎన్నికల్లో అధికారానికి దూరం అయింది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించిన అధిష్ఠానం అతని సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లింది. సక్సెస్ అయింది. లోక్ సభ ఎన్నికల్లోను ఎనిమిది స్థానాలు గెలుచుకుంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకాన్ని చాలా మంది సీనియర్లు వ్యతిరేకించారు. అసలైన కాంగ్రెస్ వాదుల పేరిట గ్రూపు కట్టారు.


డబ్బులు పెట్టి పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. కాని రేవంత్ వాటిని అధిగమిస్తూ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. తర్వాత సీఎం అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడిగా  రేవంత్ అయ్యాక వేరు కుంపటి  పెట్టిన సీనియర్లు ఆయన్ను అణచివేయాలని చూశారు. పదవి నుంచి తప్పించాలని అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. కానీ అధిష్ఠానం అండ ఉండటంతో వారి పప్పులు ఉడకలేదు. రేవంత్ తన వ్యతిరేకులను కూడా అనుకూలంగా మార్చుకున్నారు.


ఇక సీఎం అయిన తర్వాత రేవంత్ తన దైన ముద్ర వేస్తున్నారు. పథకాల అమలుతో పాటు. హైడ్రా వంటి నిర్ణయాలతో ఆయన ప్రజల్లో ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. మిగతా వారు ఆయనకు దూరంగా ఉండిపోతున్నారు. రేవంత్ కాకపోతే ఇంకెవరు అనే ప్రశ్న వస్తే. రేవంత్ లేకపోతే ఇంకెవరు ఉండరనే సమాధానం వస్తుంది. అందుకే లాబీయింగ్ కి అలవాటు పడిన లీడర్లు కొత్త పుకార్లకు తెరలేపుతున్నారు. రేవంత్ ఎదుగుదలను తట్టుకోలేక సంచలన వ్యాఖ్యలకు తెర తీస్తున్నారు. మరి వీటిని రేవంత్ ఎలా అధిగమిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: