ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ PCC  అధ్యక్షురాలిగా షర్మిల ఎన్నికైనప్పటి నుంచి ఎక్కువగా జగన్ వర్సెస్ షర్మిలగా వ్యవహారాలు మారాయి. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడానికి కూడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల విడిపోవడం ఒక కారణమని కూడా చెప్పవచ్చు.. కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల ఓడిపోయినప్పటికీ కూడా తన బాబాయి అయిన వివేకాహత్య కేసు విషయంలో అటు అవినాష్ రెడ్డి పై తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది.అయినప్పటికీ కూడా షర్మిల గెలవలేకపోయింది.


ఇదంతా ఇలా ఉంటే.. ఇటీవలే రాఖీ పండుగ సమయంలో కూడా షర్మిల జగన్ కు శుభాకాంక్షలు చెప్పకుండా ఒక సంచలన ట్విట్ అయితే చేసింది. తాజాగా ఇప్పుడు అన్నా, చెల్లెలు ఇద్దరు కూడా ఇడుపులపాయలో బస చేయబోతున్నట్లు సమాచారం.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులలో ఉన్నారు. బెంగళూరు నుంచి నిన్నటి రోజున కడపకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యతో మరణించిన పార్టీ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలుస్తోంది.


ఆ తర్వాత వైసిపి నాయకులతో కొద్దిసేపు తమ సమయాన్ని గడిపిన జగన్ ఆ తర్వాత కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రహాసిరెడ్డి కూతురు వివాహానికి సైతం వెళ్ళినట్లు తెలుస్తోంది. నిన్నటి రోజున సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారట. అదే సమయంలో షర్మిల కూడా ఇడుపులపాయకి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజున వైయస్సార్ వర్ధంతి కావడం చేత అన్నా చెల్లెలు ఇద్దరు కూడా తన తండ్రికి నివాళులు అర్పించబోతున్నారు. అయితే ఇద్దరు వేరువేరుగా ఇవ్వబోతున్నారా లేకపోతే ఎలా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉన్నది. జులై 8వ తేదీన ముందుగా జగన్ తన తండ్రి నివాళులకు అర్పించినప్పుడు అనంతరం షర్మిల కూడా అక్కడికి చేరి నివాళులు అర్పించింది. వీరిద్దరితో కూడా తల్లి విజయమ్మ హాజరయ్యారు.మరి ఈసారి కూడా అలాగే జరుగుతుంది ఏమో చూడాలి. అన్నా చెల్లెలు ఇద్దరు కూడా పులివెందులలో ఉండడం మరింత ఆసక్తిని పెంచుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: