జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అభిమానులకు స్పెషల్ డే కాగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. గబ్బర్ సింగ్ సినిమా రీరిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా తన మార్క్ పాలనతో సత్తా చాటుతూ ప్రశంసలు అందుకుంటూ ఉండటం గమనార్హం.
 
ఆడపిల్లలకు కష్టం వచ్చిందని తెలిస్తే పవన్ కళ్యాణ్ అస్సలు ఊరుకోరనే సంగతి తెలిసిందే. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వగా తాజాగా ఈ కేసును సీఐడీకి అప్పగించడం జరిగింది. 2017 సంవత్సరంలో సుగాలి ప్రీతి ఘటన చోటు చేసుకోగా అప్పటినుంచి ఇప్పటివరకు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో కచ్చితంగా న్యాయం జరిగే ఛాన్స్ ఉందని చాలామంది భావిస్తున్నారు.
 
తాజాగా ఏపీలో ఏడాదిన్నర క్రితం మిస్సైన యువతి గురించి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు అందగా ఆ యువతిని పోలీసులు జమ్మూలో గుర్తించి విజయవాడ తీసుకొనిరావడం జరిగింది. అమ్మాయిల మిస్సింగ్ కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా పవన్ కళ్యాణ్ మాత్రం ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. పవర్ స్టార్ రాజకీయాల్లో తన మార్క్ పాలనతో సత్తా చాటుతున్నారు.
 
సినిమాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సంక్షేమానికే ఆయన ఓటు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదగడం పక్కా అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజకీయాలకు సంబంధించి పవన్ వ్యూహాలు ఎలా ఉండనున్నాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: