* 1996 లో హీరోగా టాలీవుడ్‌ లోకి ఎంట్రీ
*  చిరంజీవి తమ్ముడిగా గుర్తింపు
* దేశ వ్యాప్తంగా పవన్‌ కళ్యాణ్‌ కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌
* పవర్‌ స్టార్‌ గా పవన్‌ కళ్యాణ్‌ కు బిరుదు



జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న జనసేన పార్టీ...  ఏపీలో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి వచ్చింది.  అయితే రాజకీయాలలో కంటే మొదటగా సామాజిక సేవలో పవన్ కళ్యాణ్ కు మంచి పేరు ఉంది.


1996 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో... హిట్టు అందుకున్నాడు. తమ్ముడు, బద్రి, ఖుషి మరియు తొలిప్రేమ లాంటి సినిమాలను తర్వాత తీసి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ఎదిగాడు పవన్ కళ్యాణ్. అయితే హీరోగా ఎదుగుతున్న సమయంలోనే... తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు పవన్ కళ్యాణ్.


అలా.. ఏ ఒక్క ఫ్యాన్ కు కష్టం వచ్చినా... క్షణాల్లోనే స్పందించి వారి సమస్యను తీర్చేవాడు పవన్ కళ్యాణ్. అంతేకాదు తన సంపాదనలో దాదాపు 50 శాతం.... ఫ్యాన్స్ కోసం మాత్రమే ఖర్చు పెట్టేవాడు. అన్నా కష్టం వచ్చిందని  ఎవరైనా రాగానే...  కోటి రూపాయల చెక్కు కూడా రాసి సత్తా ఉన్న  లీడర్ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. చిన్నపిల్లల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలతో పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తూ ఉంటారు జనాలు.


అయితే తన ఫ్యాన్ కాకుండా సరే... తన వద్దకు ఏ కష్టంతో వచ్చిన... వారిని ఆదుకుంటాడు పవన్ కళ్యాణ్. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారిపోయారు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి. అంతేకాదు... తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న పండ్లు అలాగే కూరగాయలను... ఇప్పటికి తన ఫ్యాన్స్ కు పంపిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్.  ప్రతి కార్యక్రమంలో కూడా రక్తదానాన్ని.. చేయాలని ప్రతి ఫ్యాన్ కు పిలుపునిచ్చేవారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: