ప్రభుత్వాలు మారిన ప్రతిసారి అధికారులు మారడం కామన్. తమకు నచ్చిన అధికారులను, తాము మెచ్చిన ఉద్యోగులను నియమించుకోవడం సర్వసాధారణం. అయితే అది ఇటీవల మరింత విస్తృతం అయింది. నచ్చని అధికారులను సాధారణ పరిపాలన శాఖకు సరెండర్ చేయడం, డీజీపీ ఆఫీస్ కు రిపోర్ట్ చేయమనడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.


గతంలో ప్రభుత్వాలు మారిన సమయంలో గిట్టని అధికారులను అప్రధాన్య పోస్టుల్లో నియమించేవారు. చూసి చూడనట్టుగా విడిచి పెట్టేవారు. కాని ఇప్పుడు అలా కాదు. ఈ ప్రభుత్వానికి సహకరించారు.. ఆ ప్రభుత్వ పెద్దలకు వెన్నుదన్నుగా నిలిచారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ ఆదేశాలతో తమను వేధించారు అన్నది హైలెట్ అవుతుంది. అప్పటి పాలకుల ఆదేశాలు పాటించిన అధికారులు టార్గెట్ అవుతున్నారు.


అప్రధాన్యం పోస్టులే కాదు వారు అసలు అధికారులే కాదన్నట్లు చిన్నపాటి ఉద్యోగులుగా కూడా చూడటం లేదు. నేరుగా రెండు పూటలా వచ్చి సంతకాలు పెట్టమని చెబుతున్నారు. ఖాళీగా కార్యాలయంలో కూర్చోమని ఆదేశాలు ఇస్తున్నారు.  గడిచిన ఐదేళ్ల కాలంలో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లు కొంతమంది అతిగా వ్యవహరించారు అనేది టీడీపీ నాయకుల ఆరోపణ. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటిస్తూ.. ప్రత్యర్థులను వేధించారు.


అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో అలా వేధించిన అధికారులను వెంటాడటం ప్రారభించింది. ఏకంగా 19 మంది ఐపీఎస్ లకు అసలు పోస్టింగ్ లే ఇవ్వలేదు. అయితే ప్రతి రోజు వారు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ కార్యాలయంలో కూర్చోవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇలా ఆదేశాలు ఇచ్చిన డీజీపీ కూడా ఇక అధికారి కావడం విశేషం.


అయితే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి  ప్రత్యర్థులను వేధించడం కామన్. కానీ అంతకుమించి ఇప్పుడు అధికారులను టార్గెట్ చేస్తున్నారు. ఇలా వేధిస్తుంది కూడా అధికారులే. ప్రభుత్వ పెద్దలు చెప్పారనో.. ప్రమోషన్ల కోసం వారి ఆదేశాలు పాటిస్తే మూల్యం చెల్లించుకునేది కూడా వారే. అందుకే ప్రభుత్వాలు కంటే తమ మనస్సాక్షిని నమ్ముకోవడం చాలా ముఖ్యం. ప్రాథమిక స్థాయి నుంచి చదువులో ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చుంటారు. కానీ రాజకీయ నేతల తప్పిదాలకు వీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అందుకే అధికారుల్లో మార్పు రావాలి. వారు సంఘటితం కావాలి . అప్పుడే సాధ్యపడుతుంది. లేకుంటే అపఖ్యాతి మూట కట్టుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: