బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, విద్యాసంస్థల ఛైర్మన్లకు సీఎం రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షమైన కారు పార్టీ ఎమ్మెల్యేల్లో అనేక మందికి రకరకాల వ్యాపారాలున్నాయి. ఇందులో జనగాం, మేడ్చల్ ఎమ్యేల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డిలకు విద్యా సంస్థలు ఉన్నాయి. ఇప్పటికే వీళ్లు చెరువులు, కుంటలను ఆక్రమించి కాలేజీలు నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి.


చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ భవనాలు నిర్మించారనే ఆరోపణలతో హైడ్రా వీరికి నోటీసులు సైతం జారీ చేసింది. కాకపోతే అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు పడతారు అని భావించి వారికి ఈ విద్యా సంవత్సరం వరకు గడువు ఇచ్చింది. హైడ్రా నోటీసుల వివరాల ప్రకారం.. వచ్చే ఏడాది విద్యా సంవత్సరంలోపు నోటీసులు ఇచ్చిన కాలేజీల్లో అడ్మిషన్లు చేర్చుకునేందుకు వీల్లేదు. వీళ్లు హైడ్రా నోటీసులకు వ్యతిరేకంగా కోర్టుకి వెళ్లినా ఊరట దక్కలేదు.


అందుఏ ఈలోపు సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ చేశారు. అదేంటంటే.. సీట్ల కన్వర్షన్. ఏ ఇంజినీరింగ్ కాలేజీలో అయినా విద్యార్థులు టాప్ ప్రయారిటీ కంప్యూటర్ సైన్సే. యాజమాన్య కోటాలో సీటు సంపాదించుకునేందుకు సుమారు 7-8 లక్షల వరకు ఖర్చు పెడతారు. ఇదే సమయంలో మిగతా కోర్సుల్లే చేరేందుకు విద్యార్థులు ఇష్టపడటం లేదు.


ఇక్కడే పై యాజమాన్యాలు కన్వర్షన్ పేరుతో పెద్ద ప్లాన్ వేశాయి. వేరే గ్రూపుల్లో మిగిలిపోయిన సీట్లను కన్వెర్షన్ కింద కంప్యూటర్ కోర్సుల్లోకి మార్చేస్తారు. దీని వల్లం మిగిలిన కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపకపోయినా కంప్యూటర్ కోర్సులో మాత్రం ఉన్న సీట్లకు మాత్రం వచ్చి చేరతారు. దీనికోసం ఎన్ని లక్షల రూపాయిలు అయినా ఖర్చు పెడతారు. విద్యార్థుల భవిష్యత్తు, కోర్సుల డిమాండ్ కారణంగా జేఎన్టీయూ, ఏఐసీటీఈ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లాంఛనమే అవుతుంది.


గతంలో అధికార పార్టీ కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్వర్షన్ పద్ధతికి రెడ్ సిగ్నల్ వేసింది. దీంతో ఏఐసీటీఈ, జేఎన్టీయూ అనుమతి ఇచ్చాక ప్రభుత్వం అడ్డు జెప్పడం ఏంటని యాజమాన్యాలు కోర్టులో పిటిషన్ వేశాయి. ప్రభుత్వ వాదన విన్న కోర్టు సంతృప్తి వ్యక్తం చేసి సీట్ల కన్వర్షన్ కుదరదని చెప్పింది. దీంతో వారికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: