2024 లో ఎన్నికలలో ఉమ్మడి కడప జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో టిడిపి పార్టీ గెలిచింది. అయితే అక్కడ టిడిపి నేతలు మధ్య ఐక్యత లేక పరిస్థితి దారుణంగా తయారయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. గెలిచిన ప్రతి నియోజకవర్గంలో కూడా నేతల మధ్య ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉందట. జిల్లాలో పరిస్థితి అధిష్టానానికే సవాల్ గా మారింది. కొందరు ఎమ్మెల్యేల దుడుకు చేష్టలు పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చాలా చేస్తున్నాయట. ముఖ్యంగా టిడిపి పార్టీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయట.



కడప జిల్లాలో గెలిచిన టిడిపి ఎమ్మెల్యేల మధ్య విభేదాలు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. టిడిపిలోని సీనియర్ నేతలు ఎమ్మెల్యే మాధవరెడ్డి అసలు పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. పైగా తనకు ఇష్టం లేని,నచ్చని టిడిపి నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా చర్యలు చేపట్టడంతో పార్టీ నేతల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరిపోయాయి అంట. వీటికి తోడు కడపలో మొదటినుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న ప్రిఫరెన్స్ ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు ఆయన గోవర్ధన్ రెడ్డి, లక్ష్మి రెడ్డి వంటి నేతలు  ఎమ్మెల్యేలు తీరు నచ్చక దూరంగా ఉంటున్నారట.




మరొక పక్క కడప పక్కనే ఉన్న కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి , ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే బుద్ధ నరసింహులు కడప జిల్లా కేంద్రం పైన పట్టుకోవడం ప్రయత్నిస్తున్నారట. వీరిని నివారించేందుకు కడప ఎమ్మెల్యే అనుచరులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారట. దీంతో కమలాపురం కడప ఎమ్మెల్యే మధ్య వివాదాలు మొదలవుతాయి. కడప మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద చెత్త వేయడంతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరును సొంత పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారట. సీఎం చంద్రబాబు కూడా ఈమెను మందలించినట్లుగా సమాచారం. పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందట. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీరును సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారట. జమ్మలమడుగుల ఆదినారాయణ రెడ్డి బిజెపి నుంచి గెలవగా.. ఆయన సోదరుడు కుమారుడు ఎంపీగా చేసి ఓడిపోయారు. అన్నమయ్య జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గలలో టిడిపి నేతల మధ్య ఏమాత్రం పొత్తు కుదరడం లేదట. రైల్వే కోడూరులో పేరుకే జనసేన ఎమ్మెల్యే ఉన్న.. పెత్తనం అంతా కూడా టిడిపి నాయకుల అదేనట. దీంతో జనసేన నాయకులు అసహనాన్ని తెలుపుతున్నారట. కూటమినేతలు గెలిచి మూడు నెలలు కాకముందే ఇలా విభేదాలు చోటు చేసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: